సినిమా తీసే విధానం ఇదే అంటూ ఒకటి లేదు. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు సినిమాలు తీసే అవకాశం ఉంది. వందల కోట్ల బడ్జెట్ పెట్టి తీసిన సినిమా అయినా ఒక కోటి బడ్జెట్ పెట్టి తీసిన సినిమా అయినా సరే ఓవరాల్ గా నచ్చాల్సింది మాత్రం ప్రేక్షకులకే. ముఖ్యంగా సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది యూత్ ఆడియెన్సే.


మాములుగా సినిమా ఆడటానికి అందరు చెప్పినట్టుగా ఏ,బి,సి సెంటర్స్ అంటారు. మాస్ సినిమా అయితే బి,సి సెంటర్స్ లో ఆడుతుంది. క్లాస్ సినిమా అయితే ఏ సెంటర్ లో ఆడుతుందని ఏవో లెక్కలు చెబుతారు. అయితే ఆయా సెంటర్స్ లో కూడా యూత్ ఆడియెన్స్ కు నచ్చే సినిమాలే ఎక్కువ ప్రేక్షకాదరణ పొందుతాయి.  


ఇక లేటెస్ట్ గా యూత్ అందరు చూసే సినిమా ఏదైనా ఉంది అంటే అది అడల్ట్ కంటెంట్ మూవీస్. సినిమాలో ఒక లిప్ లాక్, కనీసం ఒక హాట్ సీన్ లేనిదే సినిమా చూసే అవకాశం కనిపించట్లేదు. కొందరు వాటి కోసమే సినిమా చూస్తున్నారంటే నమ్మాలి. వీరి కోసమే సినిమాలో ఉన్న ఒకటి  రెండు హాట్ సీన్స్ టీజర్, ట్రైలర్ లో వేస్తున్నారు.


అయితే లేటెస్ట్ గా అలాంటి ఓ అడల్ట్ కంటెంట్ అబ్బ మొగుడు లాంటి సినిమా వచ్చింది. ఆ సినిమానే ఏడు చేపల కథ. ఈ సినిమా టీజర్ తోనే యూట్యూబ్ ను షేక్ చేసింది. గురువారం రిలీజైన ఈ సినిమా చూసేందుకు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న యూత్ ఎగబడుతున్నారు. ఏపి, తెలంగాణాలో ఈ సినిమా 600 స్క్రీన్స్ లో రిలీజైంది. యూత్ అంతా ఆ సినిమాకు మచి ఓపెనింగ్స్ వచ్చేలా చేశారు. ఆడియెన్స్ కోరుకుంటున్నారు కాబట్టి దర్శక నిర్మాతలు కూడా బూతు కంటేంట్ మీదే ఎక్కుద దృష్టి పెడుతున్నారు. మరి ఇది రానున్న రోజుల్లో ఇంకెలా టర్న్ అవుతుందో చూడాలి.
 


మరింత సమాచారం తెలుసుకోండి: