టాలీవుడ్  హీరో నితిన్, పవన్ కల్యాణ్ ఫ్యాన్ అనే విషయం  ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. ఈ కుర్రాడు గతంలో చాలా  సినిమాల్లో పవన్ ను అనుకరించాడు నితిన్. ఇప్పుడు కూడా అదే చేసాడు. పవన్ సూపర్ హిట్ మూవీ తొలిప్రేమలోని ఓ పాటను కూడా రీమిక్ చేశాడు. ఇలా పవన్ కు వీరాభిమానిగా కొనసాగుతున్న నితిన్, ఇప్పుడు పవన్ నటించిన ఓ హిట్ సినిమా సీన్ ను కూడా రిపీట్ చేశాడు.


వివరాల్లోకి వెళితే .. ఖుషీలో నడుము సీన్ ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. నువ్వు నా నడుము చూశావ్ అంటుంది భూమిక. నేను చూడలేదంటాడు పవన్. అక్కడ్నుంచే సినిమాలో ట్విస్ట్ మొదలవుతుంది. ఇప్పుడు భీష్మ సినిమాలో కూడా దాదాపు అదే సీన్ ఉంది. అలా రష్మిక నడుము చూస్తూ సంబరపడిపోతాడు నితిన్. సడెన్ గా ఆ విషయాన్ని రష్మిక గమనిస్తుంది. ఈ సినిమాకు సంబందించిన వీడియో క్లిప్ ను రిలీజ్ చేశారు. 


ఈరోజు త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియోను రిలీజ్ చేసిన యూనిట్.. భీష్మ సినిమాను ఫిబ్రవరి 21న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్టు డేట్ కూడా ప్రకటించింది. వీడియోలో రష్మిక అందంగా, నితిన్ రొమాంటిక్ గా ఉన్నారు. వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. షూటింగ్ పనుల్లో బిజీగా ఉంది. 


ఈ సినిమాలో విజయ్ మాల్యా ప్రేమలా.. నా ప్రేమ ఉంటుంది రా అంటుంది. ఎప్పుడు కనికరిస్తుందా అని తన వెనక పడతాడు నితిన్. ఇలా చూసుకుంటే ఈ సినిమా రొమాన్స్ ను తలపిస్తుందని నితిన్ వెల్లడిస్తున్నారు. వారి ప్రేమ ఎలా సాగుతుందో అన్నది ఈ సినిమా కథాంశంసం. సినిమాలో పాటలు అన్ని సూపర్ హిట్ అని చిత్ర దర్శకులు వెల్లడిస్తున్నారు మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: