నందమూరి బాలకృష్ణ సరసన లెజెండ్ సినిమాలో నటించిన అందమైన హీరోయిన్ రాధిక ఆప్టే. ఈ సినిమాలో పర్‌ఫార్‌మెన్స్ కి వచ్చిన ఫీడ్ బ్యాక్ తో మళ్ళీ రెండవసారి లయన్ సినిమాలోనూ బాలయ్య సరసన ఆడి పాడింది. అంతకుముందు ఆర్జీవీ రక్త చరిత్రలోనూ తన నట ప్రతిభతో ఆకట్టుకుంది. ఆ సినిమా వల్లే రెండుసార్లు బాలయ్య తో నటించే ఛాన్స్ అందుకుంది. అలాగే బాలీవుడ్ లో తీసిన నెట్ ఫ్లిక్స్ లస్ట్ స్టోరీస్ తో మరింత పాపులారిటీ దక్కించుకుంది. వీటన్నిటినీ మించి అడపా దడపా వివాదాలతోనూ ఈ బ్యూటి అందరితోను ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది.

ఈ కాంట్రవర్శీ క్వీన్ డైరెక్టుగా హాలీవుడ్ కి షిఫ్టవ్వాలని అనుకుంది. ఏకంగా హాలీవుడ్ లో జేమ్స్ బాండ్ సినిమాలోనే నటించేయాలని కలలు గందట. జేమ్స్ బాండ్ - ది స్టార్ వార్స్ లాంటి భారీ హాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అంతేకాదు.. ఆ రెండు సినిమాల కోసం తనకు తానుగానే ఇంట్లో ఆడిషన్స్ చేసుకుని ఆ వీడియో క్లిప్పింగ్స్ ని కాస్టింగ్ ఏజెంట్లకు కూడా పంపించిందట. దీన్ని బట్టి చూస్తేనే రాధిక హాలీవుడ్ లో ఫేమస్ అవడానికి ఎంతగా ఆసక్తి చూపిస్తుందో అర్థమవుతుంది.

అయితే వాటికి ఎంపిక అయ్యిందా లేదా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది. ప్రస్తుతం డేనియల్ క్రెయిగ్ కథానాయకుడిగా జేమ్స్ బాండ్ 25 సెట్స్ పై ఉంది. బాండ్ సినిమా అంటే ఎంతో కొంత పార్ట్ ఇండియాలోనూ చిత్రీకరిస్తారు. స్టార్ వార్స్ కి ఇండియా నేటివిటీ కనెక్టివిటీ ఉంది. ఇవన్నీ చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి క్రేజీ చిత్రాల్లో నటించాలని ఆశపడిన ఈ బోల్డ్ బ్యూటీ కల నెరవేరాలని అందరు కోరుకుంటున్నారు! ఇక ఇదే విషయంలో రాధిక అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇక రాధిక పాత్ర డిమాండ్ చేస్తే న్యూడ్ గాను నటించడానికి ఏమాత్రం ఆలోచించదన్న విషయం తెలిసిందే.   



మరింత సమాచారం తెలుసుకోండి: