తెలుగు సినిమాల్లో మహేశ్ బాబుకు స్టార్ హీరో. మహేశ్ అందరికీ గౌరవం ఇస్తాడు.. అంటూ చాలామంది తమ ఇంటర్వ్యూల్లో చెప్తూంటారు. కానీ మహేశ్ చేసే ట్వీట్లు చూస్తే సగటు సినీ అభిమానికి ఈ విషయంలో డౌట్ రాక మానదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మహేశ్ ఇటివల చేసిన ట్వీట్స్ చూస్తే అన్నీ తమిళ సినీ పరిశ్రమ వాళ్లని పొగుడుతూనో, శుభాకాంక్షలు చెప్తూనో ఉంటాయి.

 


కార్తీ.. ఖైదీ, ధనుష్.. అసురన్.., రజనీకాంత్.. దర్బార్.., కమల్ హాసన్.. జన్మదిన శుభాకాంక్షలు.. ఇలా మహేశ్ చేసిన ట్వీట్స్ అన్నీ తమిళ పరిశ్రమ వారికే. నిన్న కమల్ తో పాటు టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పుట్టినరోజు కూడా. కానీ త్రివిక్రమ్ కు శుభాకాంక్షలు చెప్పలేదు. మహేశ్ కు రెండు క్లాసిక్ చిత్రాలు ఇచ్చిన త్రివిక్రమ్ ను మహేశ్ అవమానించాడంటూ అంటూ సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. విచిత్రం ఏంటంటే రజనీకాంత్ నుంచి కార్తీ వరకూ ఎవరూ మహేశ్ ను గానీ, టాలీవుడ్ సినిమాల గురించి కానీ ఏ సందర్భాన ట్విట్టర్ లో పొగిడింది ఉండదు.. వాళ్ల సొంత తమిళ పరిశ్రమ గురించి తప్ప. ఆమధ్య జల్లికట్టు విషయంలో మద్దతు తెలిపిన మహేశ్.. సంక్రాంతికి మన కోళ్లపందాల విషయంలో మాత్రం కనీసం స్పందించలేదు.

 


సినిమా అనేది ఎక్కడైనా ఒకటే. కాకపోతే భాష మారుతుంది.. అనే మాట నిజం. కానీ తమిళంపై ఇంత ప్రేమ చూపే మహేశ్ తన మాతృ పరిశ్రమ టాలీవుడ్ ను కూడా చూడాలని నెటిజన్లు హోరెత్తిస్తున్నారు. మహేశ్ చెన్నైలో పుట్టినా తెలుగు వాడే. కెరీర్ తెలుగులోనే. స్టార్ డమ్ వచ్చింది తెలుగులో. ‘ఈ చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యావు మహేశ్’ అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: