వచ్చే సంవత్సరం బాలకృష్ణకు షష్టిపూర్తి జరగబోతోంది. అయినా బాలయ్య స్పీడ్ మరింత పెరిగింది. వచ్చే నెలలో ప్రారంభం కాబోతున్న బాలయ్య బోయపాటిల కాంబినేషన్ మూవీకి నటీనటుల ఎంపికకు సంబంధించిన వార్తలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు విలన్ గా సంజయ్ దత్ ఎంపిక అయిన నేపధ్యంలో ఈ మూవీ హీరోయిన్ ఎంపిక మరింత షాకింగ్ గా మారింది. 

ఈ మూవీకి కన్నడ బ్యూటి రచిత రామ్ ను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 27 సంవత్సరాల రచితకు బాలకృష్ణకు ఏజ్ గ్యాప్ 33 సంవత్సరాలు ఉంటుంది. అయితే ఇంత వయసు గ్యాప్ ను కూడ లెక్కచేయకుండా ఈమూవీకి ఈకన్నడ బ్యూటీని ఎంపిక చేయడం అత్యంత ఆశ్చర్యంగా మారింది. 

ఈమధ్యనే విడుదలైన ‘మన్మధుడు 2’ మూవీలో రకుల్ ప్రీత్ నాగార్జునుల రొమాంటిక్ సీన్స్ పై విపరీతమైన విమర్శలు వచ్చాయి. అదేవిధంగా ‘సైరా’ విషయంలో తమన్నా చిరంజీవిల మధ్య ప్రేమను చూసి ప్రేక్షకులు తట్టుకోలేక పోయారు. ఇలాంటి పరిస్థితులలో ఇన్ని విమర్శలు వివాదాలు వచ్చినా అవేమి పట్టించు కోకుండా బోయపాటి రచిత రామ్ ను ఎంపిక చేయడం షాకింగ్ న్యూస్ గా మారింది. ఇలాంటి విషయాలను బాలకృష్ణ పట్టించుకోకపోయినా ప్రస్తుత తరం ప్రేక్షకులు విపరీతంగా పట్టించుకుని ట్రోల్ చేస్తున్నారు.  

ఈ నెగిటివ్ కామెంట్స్ ను తట్టుకుని బాలయ్య ఎలా నిలబడతాడు అన్నది కొంతవరకు సమాధానం లేని ప్రశ్న. కన్నడ సినిమా రంగంలో చాల దూకుడుగా వ్యవహరిస్తూ స్పైసీ సీన్స్ కు ఓకె చెప్పే రచిత రామ్ చేత బోయపాటి ఎలాంటి సీన్స్ లో నటింపచేయబోతున్నాడు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. బోయపాటి బాలయ్య మూవీ కోసం ఎంపిక చేస్తున్న నటీనటులను చూస్తుంటే ఈమూవీని చాల విభిన్నంగా తీర్చి దిద్దడానికి ఎన్ని ప్రయత్నాలు ఉన్నాయో అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: