టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలతో మంచి మార్కెట్ అర్జున్ రెడ్డి సినిమా తో క్రియేట్ చేసుకున్న విజయ్ దేవరకొండ తో హీరోయిన్ రష్మిక మందన ప్రేమలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు దక్కించుకుంటున్న ఈ ముద్దుగుమ్మ పై సోషల్ మీడియాలో మరియు అలాగే తెలుగు మీడియా రంగంలో విజయ్ దేవరకొండ తో ప్రేమలో ఉన్నట్లు అనేక రూమర్స్ బాగా వినబడుతున్నాయి. దీంతో ఈ రూమర్స్ పై విజయ్ దేవరకొండ మరియు అదేవిధంగా రష్మిక మందన అనేకసార్లు క్లారిటీ ఇచ్చిన కానీ వస్తూనే ఉన్నాయి.


ఇదిలా ఉండగా తాజాగా ఇటీవల  విజయ్ దేవరకొండతో ఆమె ఎఫైర్ నడుపుతున్నట్లు ఓ వ్యక్తి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ పై రష్మిక మందన్న ఆగ్రహానికి గురైంది. ఆమె వివరణ ఇస్తూ.. "యాక్టర్స్ అయినంత మాత్రానా విమర్శిస్తారా? నటీనటుల మీద విమర్శలు చేస్తే మీకు ఏమొస్తుంది. నాకైతే అర్ధం కావడం లేదు. మేము చేసే సినిమాలను విమర్శించే హక్కు ఉంది. కానీ మా వ్యక్తిగత విషయాలపై అలాగే ఫ్యామిలీలను విమర్శించే హక్కు ఎవరికీ లేదు.


సినిమా నటీనటులు అంటే ప్రతి వారికి టార్గెట్ అయిపోయింది నెగటివ్ కామెంట్స్ చేసి పేరు తెచ్చుకోవడానికి తెగ తాపత్రయపడుతున్నారు ఇలాంటి విమర్శలు సామాన్యులకు కూడా కలగకూడదు రాకూడదని కోరుకుంటున్నట్లు వివరణ ఇచ్చిన రష్మిక మందన సినిమా నటీనటులుగా ఉంటూ భూమి మీద బతకడం కష్టం అని అంత ఈజీ కాదని తెలియజేశారు. ప్రస్తుతం రష్మిక మందన మహేష్ బాబు సినిమా సరిలేరు నీకెవ్వరు మరియు అదే విధంగా నితిన్ నటించిన భీష్మ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది. రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో తాజాగా ఇచ్చిన క్లారిటీతో అయిన విజయ్ దేవరకొండ తో రష్మిక మందనపై వస్తున్న రూమర్స్ తగ్గుతాయో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: