పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకపక్క రాజకీయాలు చేస్తూనే మరోపక్క సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జనసేన పార్టీ వ్యవస్థాపకుడిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ కి అన్నయ్య చిరంజీవి అన్న వదిన సురేఖ అయినా ఎనలేని గౌరవం. చాలా సందర్భాలలో తన అన్న గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురైన సందర్భంలో అనేక వేదికలపై తను హీరో అవ్వడానికి గల కారణాలలో తన వదిన సురేఖ ప్రోద్బలం కూడా ఉందని పవన్ తెలియజేశారు.


ఇటువంటి నేపథ్యంలో అప్పట్లో పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలోకి వచ్చిన సందర్భంలో నటించిన గోకులంలో సీత సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్ గా రాజీ నటించడానికి కల కారణం చిరంజీవి భార్య సురేఖ అంటూ తాజాగా ఇటీవల మా టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరోయిన్ రాశి తెలిపారు. ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో కెరియర్ పరంగా మంచి టైం లో ఉన్న సమయంలో..పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన నేపథ్యంలో చిరంజీవి భార్య సురేఖ గారు తనని ఇంటికి పిలిచారని తమ మరిది పవన్ పక్కన హీరోయిన్ గా నటించాలని కోరారని ఇటీవల రాశి తెలిపింది.


చాలా సందర్భాలలో పవన్ కళ్యాణ్ తన తల్లి లాంటిదని తన వదిన సురేఖ పేర్కొనటం జరిగింది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ అప్పట్లో ఖాళీగా ఉంటున్న సమయంలో సినిమాల్లోకి పంపించిన వదిన కెరియర్ పరంగా పవన్ కళ్యాణ్ కి మొదటిలో చాలానే సహాయం చేసినట్లు పవన్ కళ్యాణ్ సక్సెస్ అవ్వడానికి చాలా కృషి చేసినట్లు బయటకు వస్తున్న విషయాలు బట్టి తెలుస్తుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు...ఈ నేపథ్యంలో త్వరలో బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ డూపర్ హిట్ అయిన పింక్ అనే సినిమా తెలుగులో రీమేక్ చేయటానికి రెడీ అవుతున్నట్లు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: