జబర్దస్త్ లో కమెడియన్ గా  ఎంట్రీ ఇచ్చిన  సుడిగాలి సుదీర్ ఆ తర్వాత టీం లీడర్ గా మారిపోయాడు. అయితే జబర్దస్త్ లో కామెడీ చేయడమే కాకుండా పలు షోలలో  యాంకరింగ్ చేస్తూ అక్కడ సత్తా చాటుకున్నాడు సుదీర్  . రష్మీ తో ప్రేమలో ఉన్నట్లు కవరింగ్ ఇస్తూ భారీ క్రేజ్ సంపాదించుకున్నాడు సుధీర్. ఓవైపు జబర్దస్త్ లో కామెడీ చేస్తూనే మరోవైపు డీ లో డాన్స్ తో దుమ్ము రేపుతున్నారు. మరోవైపు స్పెషల్ ఈవెంట్స్  లో మ్యాజిక్  షోలతో అదరగొడుతున్నాడు. మల్టీ టాలెంటెడ్ గా తన సత్తా చాటుతూన్న  సుధీర్ ఇమేజ్ కూడా బాగా పెరిగిపోతుంది. సుధీర్ కు హీరోల స్థాయిలో ఇమేజ్ పెరిగిపోయింది. అయితే ప్రస్తుతం బుల్లితెరపై రష్మి సుదీర్ జంటకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ జంట  ఇప్పుడు కనిపించినా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది. ఇక వీరిద్దరి కన్వర్జేషన్ ప్రేక్షకుల్ని ఆకర్షిస్తూ ఉంటుంది. 



 అయితే తాజాగా సుడిగాలి సుధీర్ హీరోగా మారిపోయాడు సాఫ్ట్వేర్ సుదీర్ అనే చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు సుడిగాలి సుదీర్. అయితే సాఫ్ట్వేర్ సుదీర్ సినిమాలో సుడిగాలి సుదీర్ సరసన రాజు గారి గది ఫెమ్  ధన్య బాలకృష్ణన్  నటిస్తోంది. కాగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా హీరో సుడిగాలి సుధీర్  ఓ ఆసక్తికర విషయం వెల్లడించాడు . రష్మీ సుధీర్ జంటకు  కి బుల్లితెరపై భారీ క్రేజ్ ఉండటంతో ఈ సినిమాలో సుధీర్  సరసన రష్మి హీరోయిన్ గా నటిస్తే బాగుంటుందని చిత్రబృందం భావించిందట. వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ... సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుందని ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం మొదట చిత్ర బృందం రష్మీ ని సంప్రదించారట. కానీ రష్మీ డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో  కుదరలేదట . దీంతో రష్మీకి బదులుగా రాజు గారి గది ఫేమ్ ధన్య బాలకృష్ణన్ సుధీర్  సరసన హీరోయిన్ గా సెలెక్ట్ చేసారట చిత్రబృందం.



 అయితే సాఫ్ట్వేర్ సుదీర్ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో సుడిగాలి సుదీర్ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా సుడిగాలి సుదీర్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. రాజశేఖర్ రెడ్డి పులిచర్ల  దర్శకుడిగా శేఖర ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పారిశ్రామికవేత్త కె రాజు ఈ సినిమాను నిర్మించారు. సాఫ్ట్వేర్ నేపథ్యంలో వినోదాత్మకంగా సాగే  ఓ కమర్షియల్ చిత్రం సాఫ్ట్వేర్ సుధీర్ అని రాజశేఖర్ రెడ్డి తెలిపారు. అయితే ఈ సినిమా లో సుడిగాలి సుదీర్ రజనీకాంత్ పవన్ కళ్యాణ్ లను అనుకరిస్తూ ఉండటం సినిమాకి హైలెట్ గా నిలుస్తుందని పేర్కొన్నారు. కాగా  సుడిగాలి సుదీర్ కెరియర్ లోనే హీరోగా ఇది మొదటి సినిమా కావడంతో సుడిగాలి సుదీర్ కూడా ఈ సినిమా విడుదల కోసం ఎక్సైటింగ్ ఎదురుచూస్తున్నారని చెప్పాడు. తన ఎన్నో ఏళ్ల కల నెరవేరిందని సుడిగాలి సుదీర్ తెలిపాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: