ఒక రేడియో జాకిగా తెలుగు తెరకు పరిచయమయిన ప్రదీప్.. తన అల్లరి..తన మాటలతో అందరినీ ఆకట్టుకుంటూ వస్తున్నాడు..టాలెంట్ ఎవడబ్బ సొత్తు కాదురా అనే మాటకు ప్రదీప్ కరెక్ట్ గా సూట్ అవుతాడని వేరేలా చెప్పనక్కర్లేదు.. గడసరి అత్త సొగసరి కోడలు ప్రోగ్రాంలో అత్తకు కొడలుకు పెట్టిన మెలిక వల్ల బాగా ఫేమస్ అయ్యాడు.. అలా యాంకర్ గా అదుగెట్టిన ప్రదీప్ ఇప్పుడు టాప్ మేల్ యాంకర్ గా తన హావను కొనసాగిస్తున్నాడు.. 


ఫిమేల్ యాంకర్ మారాలి తప్ప ప్రదీప్ మాత్రం కామన్.. ఇకపోతే ఈ మధ్య ప్రదీప్ జోరు తగ్గిందని అందరూ అంటున్నారు.. అదేంటంటే.. ఈటీవీలో ప్రసరమవుతున్న ఢీ షో కి యాంకర్ గా వ్యవహరిస్తూ వస్తున్నాడు. షో అంత హైలైట్ అవ్వడానికి కారణం ప్రదీప్ కామెడీ, డ్యాన్స్, పంచులు అన్న విషయం అందరికి తెలుసు.. అలాంటి ప్రదీప్ గత మూడు ఎపిసోడ్స్ నుండి ఇండస్ట్రీలో కనపడటం లేదు.


ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా ప్రదీప్ సినిమాలు చేస్తున్నాడని కొందరు అంటున్నారు.. ఎంత సినిమాలు చేసినా కూడా ప్రదీప్ కనిపించేవాడు.. కనీసం సినిమా గురించి చిన్న అప్డేట్స్ కూడా లేకుండా అంత సీక్రెట్ సినిమా ఎంటో అని చెవులు కోరుకుంటున్నారు.. 


ప్రదీప్ పై వస్తున్నా వార్తలకు ఇవాళ ప్రదీప్ చెక్ పెట్టాడు. ప్రదీప్ మాట్లాడుతూ.. నా గురించి ఆలోచించిన మీ అందరికి చాలా థ్యాంక్స్. నాపై ఎన్నో కొత్తగా ఆసక్తిగా ఉంది. అయితే నాకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు.. సినిమాలు చేయలేదు. ఏది లేదు. యక వ్యక్తి సడన్ గా మాయమయితే అందరు ఇలానే అనుకుంటారులెండి వాళ్ళ తప్పు కూడా లేదు. నిజానికి నా కాలుకు చిన్న ఫ్యాక్చర్ అయింది. దాని వల్ల డాక్టర్లు ఎక్కువగా నిల్చోకూడదని వెల్లడించారు. అందుకే నేను షూటింగ్ కు వెళ్లలేక  పోయాను అంటూ ప్రదీప్ వెల్లడించారు. ఇంకో వారంలో నేను మళ్ళి తిరిగి షో లు చేస్తానని ప్రదీప్ వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: