సమాజంలో మనుషుల కంటే కుక్కల్నే ఎక్కువగా ప్రేమించే వారున్నారు. పెంపుడు కుక్కల కోసం భారీగా డబ్బును ఖర్చు చేస్తూ వాటిని కన్న పిల్లలకంటే ఎక్కువగా చూసుకునే వారు అక్కడక్కడ కనిపిస్తారు. ఇక మరి కొందరైతే విచిత్రంగా కుక్కల కోసం పనిమనుషుల్ని పెట్టి  మరీ వాటికి సేవలు చేయిస్తుంటారు ఇదేకాకుండా తమ ఆస్తులను కుక్క పేరుమీద రాసి మరణించిన ధనవంతులు కూడా ఉన్నారు. కాని ఎన్నైన చెప్పండి కుక్క మనిషి ఒక్కటే అంటే ఒప్పుకునే వారు సమాజంలో ఎందరుంటారు.


ఎంత ప్రేమగా చూసుకున్నప్పటికీ మనిషి మనిషే, కుక్క కుక్కనే. కుక్కకున్న విశ్వాసం మనిషికి లేదంటారు అది నిజమని ఒప్పుకోక తప్పదు. అయినా కుక్కల్ని ఇంతగా ప్రేమించే వారు కొందరు మనుషుల్ని ద్వేషిస్తారు ఎందుకో అర్ధం కాదు. ఇకపోతే నలభై ఏళ్లు వచ్చినా ఏ మాత్రం నాజుకు తగ్గని బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా తల్లి కొడుకుల బంధం పై సంచలన వాఖ్యలు చేసింది అదేమంటే తన యింట్లో పెంచుకుంటున్న కుక్కను తాను కన్న కొడుకుతో పోల్చింది.


కుక్క కొడుకు రెండు కూడ తనకు సమానమే అని చెప్పింది. నిజంగా కుక్కలపై ఎంత ప్రేమున్న వ్యక్తులు కూడా నవమాసాలు మోసి కన్న పిల్లలు, కుక్క ఒకటేనని చెప్పరూ. అలాంటిది మలైకా ఇలా చెప్పడంతో నెటిజన్లు సోషల్ మీడియాలో ఆమె దుమ్ము దులిపేస్తున్నారు. ఇకపోతే ఐటెం డ్యాన్సర్‌గా అభిమానులను సంపాదించుకున్న మలైకా అరోరా డాగ్ లవర్. అందుకని క్యాస్పర్ అనే పొమేరియన్ జాతికి చెందిన కుక్కను ఆమె ఎంతో ప్రాణంగా పెంచుకుంటున్నారు.


అంతవరకు బాగానే ఉంది. కానీ ఓ ఇంటర్వ్యూలో మలైకా మాట్లాడుతూ నా దృష్టిలో కొడుకు, కుక్కా ఒక్కటే. ఇద్దర్నీ ఒకేలా ప్రేమిస్తాను అంది. అంతే నెటిజన్స్ చేతిలో అడ్డంగా బుక్కయింది. ఇంకా నయం నా దృష్టిలో మొగుడు కుక్కా ఒక్కటే అందుకే అంతలా ప్రేమిస్తున్నానని చెప్పలే అలా చెప్పివుంటే ఆమె లవర్ బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్‌ ఎలా ఫీలయ్యేవాడో అని అనుకుంటున్నారు కొందరు నెటిజన్స్..


మరింత సమాచారం తెలుసుకోండి: