బొమ్మరిల్లు సినిమాతో అందరి మనసు దోచుకున్న హీరోయిన్ జెనీలియా త‌న తొలి సినిమా హీరో రితేష్ దేశముఖ్ ని పెళ్లి చేసుకుని ఇద్దరు పిలలలకు తల్లయ్యింది. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంది. అతి తక్కువ కాలంలోనే సౌత్ ఇండియాలోనే మంచి క్రేజ్ ని సంపాదించుకుంది జెనీలియా. ఇక ప్రస్తుతం ఇద్దరు పిల్లలకు తల్లిగా ఫ్యామిలీ జీవితానికి పరిమితమైపోయిన జెనీలియా  మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేసినట్లుగా ఈ మధ్యన వార్త‌లు వ‌స్తున్నాయి.


అయితే పిల్లలు పుట్టాక అవార్డ్స్ ఫంక్షన్ ని కూడా అవాయిడ్ చేసిన జెనీలియా ప్రస్తుతం బాలీవుడ్ ఈవెంట్స్ కి తరచు వస్తూ ఆదిరిపోయే ఫిట్నెస్ తో... అదరగొట్టే డ్రెస్సులతో నేను మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాని చెప్పకనే చేబుతుంది. ఇదిలా ఉండ‌గా మెగాస్టార్‌ చిరంజీవి 152వ చిత్రం అతి త్వరలోనే పట్టాలెక్కబోతుంది. అయితే బొమ్మరిల్లు బ్యూటీ జెనీలియా పేరు మెగాస్టార్ చిరు - కొరటాల కాంబోలో తెరకెక్కబోయే సినిమా కోసం హీరోయిన్స్ లిస్ట్ లో ఉన్నట్లుగా ఫిలిం నగర్ టాక్. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది.


అయితే  ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్‌ నటించనున్నారట. అందులో ఒక హీరోయిన్‌గా త్రిష అంటూ ఆమె పేరు చ‌క్కెర్లు కొడుతోంది. ఇక రెండవ హీరోయిన్‌ పాత్ర కోసం తెలుగు అమ్మాయి నుండి బాలీవుడ్‌ అమ్మాయి వరకు ఎంతో మంది పేర్లు వినిపించాయి. తెలుగుమ్మాయి ఈషా రెబ్బా పేరు ప‌రిశీల‌న‌కు కూడా వ‌చ్చింది. అయితే ముఖ్యంగా  సినిమాల్లోకి రీ ఎంట్రీ కోసం చూస్తున్న జెనీలియా పేరు పరిశీలిస్తున్నట్టుగా చెబుతున్నారు.  కాగా, కొరటాల ఓ వినూత్నమైన సోషల్ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: