టాలీవుడ్ సినిమా పరిశ్రమలో సాక్షి సినిమాతో నటుడిగా అడుగుపెట్టిన సూపర్ స్టార్ కృష్ణ గారు, తొలి సినిమాతోనే తనలోని ఆకట్టుకునే నటనతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించారు. ఇక ఆ తరువాత ఒక్కొక్కటిగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఎన్టీఆర్, ఏఎన్నార్ ల తరువాత రెండవ తరం నటుల్లో పెద్ద సూపర్ స్టార్ గా పేరు సంపాదించారు. ఇక ప్రాణం ఖరీదు సినిమాతో టాలీవడ్ కి నటుడిగా అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి, తొలి సినిమాతో మంచి సక్సెస్ అందుకుని, అనంతరం ఒక్కొక్కటిగా తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని, మెగాస్టార్ గా అత్యున్నత శిఖరాలను అందుకున్నారు. ఇకపోతే ఈ ఇద్దరు స్టార్స్ మధ్య మంచి అనుబంధం కూడా ఉంది. 

వీరిద్దరూ కలిసి మొత్తం మూడు సినిమాల్లో నటించడం జరిగింది. అయితే అప్పటికే కృష్ణ గారు సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న సమయంలో, అప్పుడే కొత్తగా సినీ ఇండస్ట్రీకి వచ్చిన చిరంజీవి, ఒక సినిమాలోని ఒక డాన్స్ సీక్వెన్స్ సమయంలో కృష్ణ గారితో కలసి డాన్స్ చేయవలసి ఉందట. అయితే అప్పటికే ఆ సాంగ్ లోని డాన్స్ కు సంబంధించి డాన్స్ డైరెక్టర్ రిహార్సల్స్ మొదలెట్టారట. కృష్ణ, చిరంజీవిలకు స్టెప్స్ కంపోజ్ చేసి చూపించిన తరువాత, మరి కాసేపట్లో సాంగ్ తాలూకు షూట్ మొదలు కానుందట. అయితే ఆ సందర్భంలో చిరంజీవి కొంత ఆందోళన చెందుతూ ఆలోచించ సాగారట. అయితే ఆయన ఆందోళనను గమనించిన డాన్స్ మాస్టర్, ఏంటి సర్ ఏమైనా ప్రాబ్లమా అని అడిగారట. 

ఏమి లేదు అండి, కాకపోతే కృష్ణ గారి వంటి పెద్ద హీరోతో కలిస్ డాన్స్ చేయాలంటే కొంత బిడియంగా ఉంది, నాకు అంత బాగా డాన్స్ రాదూ అని అన్నారట. అదే విషయాన్ని డాన్స్ మాస్టర్ కృష్ణ గారి వద్ద ప్రస్తావించగా, ఆయన మాట్లాడుతూ, చిరంజీవి నా మీద అభిమానంతో అలా అంటున్నాడు కానీ, నిజానికి నేను అంత గొప్ప డాన్సర్ ని కాదు, అతని డాన్స్ నేను ఇదివరకు కొన్ని సినిమాల్లో చూసాను, చాలా బాగా చేసాడు. ఏమాత్రం బిడియపడకుండా రమ్మనండి అని చెప్పారట. కాగా మొత్తం ఈ ఘటనలో సూపర్ స్టార్, మెగాస్టార్ ల గొప్పతనం మనకు అర్ధం అవుతుంది, అందుకే వారిద్దరూ అంత పెద్ద స్టార్స్ అయ్యారని, ఈ విషయాన్ని ఇటీవల ఒక సీనియర్ పాత్రికేయులు ఒకరు, ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పడం జరిగింది.....!!   


మరింత సమాచారం తెలుసుకోండి: