ప్రముఖ గాయ‌నీ, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద మీటూ(#Metoo) ఉద్యమంలో భాగంగా తనకి జరిగిన చేదు అనుభవాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపారు. కొన్ని ఏళ్ళ క్రితం ప్రముఖ తమిళ గేయ రచయిత అయినా వైరాముత్తు గదిలోకి రమ్మని నన్ను వేధించాడని ఆమె పేర్కొంది. దానితో కోలీవుడ్ తో సహా టాలీవుడ్ అంతా షాకైంది. వైరాముత్తు పైన ఆరోపణలు చేయడంతో త‌మిళ‌నాడు ఆమెను డ‌బ్బింగ్ యూనియ‌న్ నుంచి తొలగించింది. తనని ఎందుకు తొలగించారని అడిగితే అర్థంలేని సమాధానాలను చెప్పింది కోలీవుడ్. 


ఎన్ని సంవత్సరాలైనా...... చివరికి చిన్మయి మహిళా సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ కి తన బాధ చెప్పుకున్నా ఆమెకు ఇంతవరకు న్యాయం జరగలేదు. దీంతో ఆమె న్యాయం కోసం చేసే పోరాటాన్ని వదులుకొని తన పని తాను చూసుకుంటుంది. అయితే తాజాగా వైరాముత్తు ప్రముఖ దర్శకుడు కే బాలచందర్ విగ్రహావిష్కరణ వెళ్ళాడు. అక్కడే ఉన్న కమల్ హాసన్, రజిని కాంత్ వైరాముత్తు ఒక మీటూ నిందుతుడని తెలిసీ కూడా అతనితో సన్నిహితంగా ఉండటం.. ఇంకా వైరాముత్తు కమల్ హాసన్ 60 సంవత్సరాల సినీ జీవితాన్ని జరుపుకుంటున్న ఈవెంట్ లో కనిపించిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 


ఇక ఇది చూసిన చిన్మయి.. "ఒక మగాడిపై మీటూ ఆరోపణలు వస్తే అతని జీవితం నాశనం అయిపోతుంది. ఎవ్వరికీ ముఖం చూపించలేడు. నలుగురితో కలిసి బయట తిరగలేడు. కానీ డీఎంకే నిర్వహించే అన్ని వేడుకలకు వైరాముత్తు చీఫ్ గెస్ట్‌గా హాజరువుతున్నాడు. ఐఏఎస్ ఆఫీసర్ ట్రైనింగ్ ఈవెంట్స్‌కి హాజరవుతున్నాడు. అతనికి ఏమీ అవ్వలేదు. ఆరోపణలు చేసిన నన్ను మాత్రం వెంటనే డబ్బింగ్ యూనియన్ నుంచి తొలగించారు. తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పెద్దలు ఈ విధంగా న్యాయం చెప్పారు. వేధించిన వాడితో పార్టీలు, ఆరోపించిన వారిని బ్యాన్ చేశారు", అని సోషల్ మీడియా ద్వారా తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: