తెలుగు సినీ పరిశ్రమలో మోహన్ బాబుది విలక్షణ శైలి. ముక్కుసూటి స్వభావంతో పాటు ముక్కోపి కూడా అని పరిశ్రమలో అంటూంటారు. డిసిప్లిన్ కి మారుపేరు, టైమింగ్ లో మేటి అని కూడా పేరుంది. కానీ మోహన్ బాబు కోపిష్టి అనే ముద్ర మాత్రమే పడిపోయింది. ఇందుకు కారణం అనేక వేదికలపై జరిగిన కొన్ని స్పీచ్ లే కారణం. కానీ ఇదేదీ నిజం కాదని తాను నిజాయితీగా మాత్రమే ఉంటానని చెప్తూంటాడు. తాను ఎవరికీ భయపడనని.. తాను భయపడే వ్యక్ మాత్రం ఒకరున్నారని ఇటివల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

 


దర్శకులు మిమ్మల్ని సినిమాల్లో తీసుకోవడానికి అడగాలంటే భయపడతారట కదా.. అని అడిగిన ప్రశ్నకు ఆయన స్టైల్లోనే సమాధానం చెప్పాడు. నేనెప్పుడూ అకారణంగా ఎవరిపైనా కోపం తెచ్చుకోను. డిసిప్లిన్ లో ఎవరు అశ్రద్ధగా ఉన్నా నాకు కోపం వస్తుంది. నన్ను మెప్పించే సబ్జెక్టులు కాకుండా నన్ను పొగుడుతూ నాకు దూరంగా ఉండే క్యారెక్టర్లు చెప్పే వారిపై నాకు కోపం వస్తుంది అంతే. దర్శకులకు నేను భారీ పార్టీలిచ్చి వారితో సన్నిహితంగా ఉంటేనే నేను మంచోడినా అంటూ ఎదురు ప్రశ్నించారు. ఎవరికీ నేను భయపడను.. కానీ నా కూతురు లక్ష్మీ ప్రసన్న అంటే మాత్రం భయం. ఏ విషయమైనా నా దగ్గర చనువుగా చెప్పగలిగే వ్యక్తి కూడా ఆమె. నాపై అనేక విషయాలకు కోపం తెచ్చుకుంటుంది. రాక్షసిలా పడిపోతుంది. తనకు ఎంత భయపడతానో.. అంతే ఎక్కువగా ప్రేమిస్తాను.. అని చెప్పుకొచ్చాడు.

 


మోహన్ బాబు విలక్షణ శైలి గురించి తెలిసిందే. ఎంతటి వేదికపైనైనా తాను అనుకున్నది, చెప్పాలనుకున్నది ముక్కుసూటిగా చెప్పగలడు. ఈ స్వభావమే ఆయనంటే భయపడే పరిస్థితులు కల్పించాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆయనపై మోహన్ బాబు తిట్ల దండకంతో మండిపడిన ఉదంతమే ఇందుకు ఉదాహరణ.

 


మరింత సమాచారం తెలుసుకోండి: