కమల్ హాసన్ గొప్ప నటుడు, ఆయన అయిదేళ్ళ ప్రాయం నుంచే వెండి తెర మీద తనదైన నటనను పండిచారు. కమల్ అంటేనే నటనా విశ్వ‌విద్యాలయం అని వేరేగా చెప్పన‌క్కరలేదు. నిన్న కమల్ 65 ఎళ్ళ తన పుట్టిన రోజు వేడుకలను మొత్తం కుటుంబ సభ్యుల మధ్య‌ తాను పుట్టిన వూర్లో జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన తండ్రి విగ్రహాన్ని ఆవిష్కరించారు.


ఇదిలా ఉండగా కమల్ ఫ్యామిలీ అంతా కలసి ఒక్క చోట చేరింది. ఈ సందర్భంగా ఫ్యామిలీ ఫొటో కూడా తీసుకున్నారు. ఈ ఫ్యామిలీ ఫోటోలో కమల్ హాసన్ కూతుళ్ళు శ్రుతి హాసన్, అక్షర హాసన్ తో పాటు సుహాసిని, చారు హాసన్, ఇంకా  ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.


అయితే వీరితో పాటు మరో వ్యక్తి కూడా ఆ ఫోటోలో ఉండడం ఇపుడు హాట్ టాపిక్ గా  ఉంది. ఆమె ఎవరో కాదు పూజా కుమార్. కమలహాసన్ విశ్వరూపం మూవీ పార్ట్ వన్ అంటూ టూలో ఆమె పెయిర్ గా నటించింది. పూజా కుమార్ ఈ మధ్య సినిమాలు ఏమీ చేయడం లేదు. మరి ఆమె కమల్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడంతో పాటు వారి ఇంట్లో ఉండడంతో సోషల్ మీడియాలో ఈ పిక్స్ పెట్టి చర్చ చేస్తున్నారు. 


కమల్ హాసన్ మొదట వాణీ గణపతిని 1978లో వివాహం చేసుకున్నారు. ఆ తరువాత 1988లో సారికను చేసుకున్నారు. ఇక సినీ నటి  గౌతమి తో ఆయన సహజీవనం చేశారు. ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్న కమల్ జీవితం మళ్ళీ మలుపు తిరుగుతోందా అన్న అనుమానాలు ఈ ఫొటో చూస్తూ అంతా భావిస్తున్నారుట. మరి చూడాలి. ఏది ఏమైనా కమల్ అభ్యుదయ భావాలు కలిగిన వారు. ఆయన విశ్వనాయకుడు. ఆయన్ని ఓ చట్రంలో బంధించి  చూడడం కూడా తగదని కూడా అంటున్న వారు ఉన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: