యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా యావరేజ్ ఫలితాన్ని అందుకుంది. ఈ సినిమా తరువాత ప్రభాస్ రాఘవేంద్ర సినిమాలో నటించాడు. ఈ సినిమా డిజాస్టర్ అయింది. 2004 సంవత్సరంలో విడుదలైన వర్షం సినిమాతో ప్రభాస్ తొలి హిట్ అందుకున్నాడు. వర్షం తరువాత ప్రభాస్ నటించిన అడవిరాముడు సినిమా యావరేజ్ ఫలితాన్ని అందుకుంది. 
 
2005లో ప్రభాస్ కృష్ణవంశీ కాంబినేషన్లో తెరకెక్కిన చక్ర్రం సినిమా డిజాస్టర్ అయింది. చక్రం తరువాత ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన ఛత్రపతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తరువాత ప్రభాస్ నటించిన యోగి మున్నా సినిమాలు అనుకున్న ఫలితాన్ని అందుకోలేదు. ప్రభాస్ పూరి కాంబినేషన్లో తెరకెక్కిన బుజ్జిగాడు సినిమా యావరేజ్ ఫలితాన్ని అందుకుంది. ఆ తరువాత ప్రభాస్ నటించిన బిల్లా సినిమాకు హిట్ టాక్ వచ్చినా కమర్షియల్ గా హిట్ అనిపించుకోలేకపోయింది. 
 
ప్రభాస్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఏక్ నిరంజన్ సినిమా ఫ్లాప్ యింది. ఆ తరువాత ప్రభాస్ నటించిన డార్లింగ్ సినిమా హిట్ కాగా మిస్టర్ పర్ ఫెక్ట్ సూపర్ హిట్ అయింది. ఆ తరువాత ప్రభాస్ లారెన్స్ కాంబినేషన్లో తెరకెక్కిన రెబల్ సినిమా డిజాస్టర్ అయింది. ప్రభాస్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన మిర్చి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 
 
ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన బాహుబలి, బాహుబలి 2 సినిమాలు ఇండస్ట్రీ హిట్లు అయ్యాయి. ఈ రెండు సినిమాలతో ప్రభాస్ కు భారతదేశమంతటా క్రేజ్ వచ్చింది. బాహుబలి సిరీస్ తరువాత ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన సాహో సినిమా అనుకున్న స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయినా తెలుగు రాష్ట్రాల్లో హిట్ అనిపించుకుంది. ఈ సినిమాకు 40 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. ప్రభాస్ సినీ కెరీర్లో రాఘవేంద్ర, చక్రం, యోగి, మున్నా, ఏక్ నిరంజన్, రెబల్ సినిమాలు డిజాస్టర్ ఫలితాన్ని అందుకున్నాయి. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: