టాలీవుడ్ సినిమా పరిశ్రమకు మొదట మాటల రచయితగా స్వయంవరం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్, తొలి సినిమా నుండి తన పవర్ఫుల్ పంచ్ డైలాగ్స్ తో ప్రేక్షకుల నుండి మంచి పేరు సంపాదించారు. ఆ తరువాత కూడా పలు సినిమాలకు కథ, మాటలు అందించి తన క్రేజ్ పెంచుకున్న త్రివిక్రమ్, కొన్నాళ్ల తరువాత తరుణ్, శ్రియలతో కలిసి తీసిన నువ్వే నువ్వే సినిమా ద్వారా దర్శకుడిగా మారారు. అయితే తొలి సినిమాతో హిట్ కొట్టిన త్రివిక్రమ్, ఆ తరువాత మహేష్ తో అతడు, అలానే పవన్ తో  జల్సా, బన్నీతో జులాయి వంటి వరుస విజయాలతో టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్స్ లో ఒకడిగా ఎదిగారు. 

అనంతరం మరొక్కసారి సారి పవన్ తో అత్తారింటికి దారేది, ఇటీవల ఎన్టీఆర్ తో అరవింద సమేత, నితిన్ తో అఆ సినిమాలు తీసి సక్సెస్ లు అందుకున్న త్రివిక్రమ్, గత ఏడాది పవన్ తో తీసిన అజ్ఞాతవాసి, అంతకముందు మహేష్ తో తీసిన ఖలేజా సినిమాలతో ఫ్లాప్స్ కూడా చూసారు. ఇక ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో అలవైకుంఠపురములో సినిమాని తీస్తున్న త్రివిక్రమ్, దీనితో ఎలాగైనా మరొక హిట్ ని తన ఖాతాలో వేసుకోవాలని ఎంతో కసిగా పని చేస్తున్నారు. ఇకపోతే దీని తరువాత త్రివిక్రమ్ ఎవరితో పని చేస్తారు అనే దాని పై కొద్దిరోజులు నుండి వార్తలు వస్తున్న నేపథ్యంలో, నేడు ఆ విషయమై పూర్తిగా క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. 

నేటి ఉదయం నుండి త్రివిక్రమ్ వికీపీడియా అకౌంట్ లో మహేష్ 27 పేరుతో ఆయన నెక్స్ట్ సినిమాగా రాసి ఉండడంతో, మహేష్ మరియు త్రివిక్రమ్ ల కాంబినేషన్లో రాబోయే హ్యాట్రిక్ మూవీ ఫిక్స్ అయినట్లే అంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో ప్రచారం మొదలెట్టేసారు. వికీపీడియాలో పెట్టిన న్యూస్ ఎక్కువ శాతం యదార్ధమయ్యే అవకాశం ఉందని, అయితే ఈ విషయమై త్రివిక్రమ్ గారి టీమ్ నుండి అధికారిక ప్రకటన మాత్రం రావలసి ఉందని అంటున్నారు కొందరు సినిమా విశ్లేషకులు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: