తెలుగు సినిమాలను చేస్తే ఒకే రోజు రిలీజ్ చేసి ప్రేక్షకులను కన్ఫ్యూస్ చేసేస్తారు నిర్మాతలు. లేదంటే రిలీజ్ లు లేకుండానే వారాలు గడిపేస్తారు. ఇందుకు మొన్నటి దీపావళి పండుగే నిదర్శనం. పండుగ సీజన్ ను ఒక్క తెలుగు సినిమా కూడా ఉపయోగించుకోలేక అరవోళ్లకి కలెక్షన్లు కట్టబెట్టేశారు. వచ్చే నెల నుంచి జనవరి చివరి వరకూ మాత్రం పోటాపోటీగా సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. కానీ అందులో విజయ్ దేవరకొండ సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ లేకపోవడం ఆశ్చర్యపరుస్తోంది.

 


ఈ సినిమాను ఏ డేట్ లో రిలీజ్ చేస్తారోనని విజయ్ అభిమానులు చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. కానీ రిలీజ్ పై ఇప్పటికీ క్లారిటీ ఇవ్వలేదు మేకర్స్. డిసెంబర్ 20న బాలయ్య, సాయిధరమ్ తేజ్ పోటీ పడుతున్నారు. డిసెంబర్ 25న వెంకటేశ్-నాగచైతన్య వెంకీమామతో వస్తున్నారు. సంక్రాంతికి చెప్పే పనిలేదు. జనవరి 12 బన్నీ – మహేశ్ నువ్వా నేనా అనుకుంటున్నారు. జనవరి 15న కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా అంటూ వస్తున్నాడు. వీటి మధ్యలో నేనున్నాంటూ అరవ సినిమా దర్బార్ వస్తోంది. జనవరి 24న డిస్కోరాజాగా రవితేజ వస్తున్నాడు. జనవరి 25న అనుష్క నిశ్శబ్దంగా వచ్చేస్తోంది.

 


ఇన్ని సినిమాలు డేట్ లాక్ చేసుకుని సిద్ధంగా ఉంటే యూత్ లో క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ మాత్రం కామ్ గా ఉన్నాడు. ఇప్పటికీ డేట్ అనౌన్స్ చేయకపోతే ఎలా అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.  క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కేఎస్ రామారావు ప్రెజంట్ చేస్తున్న ఈ సినిమాకు క్రాంతిమాధవ్ బుర్రా దర్శకత్వం వహిస్తున్నాడు. విజయ్ సరసన నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. అసలే రెండు వారాల్లో రాబట్టుకోవాల్సిన కలెక్షన్లు.. ఇప్పటికైనా నిర్మాత వల్లభ మేల్కొంటాడో లేదో చూడాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: