తేజ దర్శకత్వం లో ఉదయ్ కిరణ్ సరసన ‘నువ్వు నేను ‘ చిత్రం తో తెలుగు తెరకు పరిచయమైంది అనిత. మొదటి చిత్రం తోనే సూపర్ హిట్ బోణి కొట్టి వరుసగా ఆఫర్లు దక్కిచ్చుకుంది.  ఎంతో మంది ఎంగ్ హీరోల సరసన  వచ్చిన ‘తొట్టిగ్యాంగ్’, ‘నిన్నే ఇష్టపడ్డాను’, ‘ఆడంతే అదో టైపు’, ‘నేను పెళ్లికి రెడీ’, ‘అహ నా పెళ్లంట’, ‘మనలో ఒక్కడు’ సినిమాల్లో నటించారు.


ఈ  సినిమాలతో ఆకట్టుకున్నప్పటికీ .... ఎక్కువ కాలం ఇండస్ట్రీ లో తన స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. కొత్త హీరోయిన్ల రాక తో ఈమెకు అవకాశాలు బాగా తగ్గాయి. దాంతో బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ కూడా అవకాశాలేవీ తలుపు తట్టకపోయేసరికి హిందీ సీరియల్లో నటించింది. ఆ తర్వాత 2013లో రోహిత్ రెడ్డి అనే తెలుగు అబ్బాయిని అనిత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.


వీరిద్దరూ డ్యాన్స్ రియాల్టీ షో ‘నచ్ బలియే 9’లో పాల్గొన్నారు. కానీ రన్నరప్స్‌గా మిగిలిపోయారు. పెళ్లితో సినిమాలకు చెక్ పెట్టిందనుకున్నప్పటికీ టీవీ సీరియల్స్ లో నటిస్తూ..... కెరీర్ ని కొనసాగిస్తుంది. బుల్లి తెర పై వచ్చిన ‘నాగిన్’ అనే సీరియల్ అనితకు మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది.  ఈ భామ కు సోషల్ మీడియా లో విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు.


అందుకే వారిని ఎప్పకప్పుడు అలరిస్తూ ఉంటుంది. తాజాగా ఈ భామ తన భర్త రోహిత్ రెడ్డితో కలిసి ఓ సెక్సీ ఫొటో షూట్‌లో పాల్గొంది. ఓ బాత్ టబ్‌లో ఇద్దరూ పడుకుని ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకుంటూ ఇచ్చిన స్టిల్స్ పిచ్చ హాట్‌గా ఉన్నాయి. ఈ ఫొటోలు చూసి అనిత ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.  భర్త మీద అమితమైన ప్రేమ కారణంగానో ఏమో కానీ ఫొటోల్లో అనిత తన కళ్లతో ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ మత్తెక్కిస్తున్నాయి.  ఆ ఎక్స్‌ప్రెషన్స్ చూసి రోహిత్ టెంప్ట్ అవుతున్నట్లు కనిపిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: