మెగాస్టర్ ఖైదీ టైటిల్ తో వచ్చిన తమిళ హీరో కార్తీ తెలుగులో మంచి హిట్ కొట్టాడు. తమిళ సినిమా అయినప్పటికీ సినిమాలో దమ్మున్న కంటెంట్ ఉండటంతో సినిమాకు మంచి రేటింగ్ వచ్చింది. మౌత్ టాక్ తో సినిమా కలెక్షన్ల పరంపర కొనసాగుతోంది.  ఇప్పుడు కార్తీ నుంచి మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. తమిళంలో కామెడీతో కూడిన క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఒక సినిమా రూపొందింది.

కార్తీ .. జ్యోతిక ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, 'తంబి' అనే టైటిల్ ను ఖరారు చేయనున్నట్టు సమాచారం. 'దృశ్యం' మలయాళ చిత్ర దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించాడు. అందువలన ఈ సినిమాపై అందరిలోను ఆసక్తి వుంది. సత్యరాజ్ .. అభిరామి కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను, తెలుగులోను విడుదల చేయాలనే ఉద్దేశంతో వున్నారు.


అక్క సెంటిమెంట్ తో సాగే ఈ సినిమాలో కార్తీకి అక్కగా సూర్య భార్య కార్తీ వదిన జ్యోతిక అక్కగా నటిస్తోంది. ఈ సినిమాకు తమిళంలో తంబీ అనే టైటిల్ పెట్టారు.  తంబీ అంటే అర్ధం తమ్ముడు అని.  అంటే తెలుగులో తమ్ముడు అనే టైటిల్ టోన్ సినిమా రిలీజ్ చేసే అవకాశం ఉన్నది.  క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ 20 వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు.  అదే రోజున బాలకృష్ణ రూలర్, సాయి ధరమ్ తేజ్ ప్రతి రోజు పండుగే, సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. 


దాంతో పాటు, రోజుల గ్యాప్‌లో మెగా మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ 'ప్రతిరోజూ పండగే' అంటూ వచ్చేస్తున్నాడు. ఆ మధ్యలోనే ఎక్కడో అక్కడ అడ్జెట్‌ అవ్వడానికి 'వెంకీ మామ' లైన్‌లో ఉన్నాడు. వీరితో పాటు, నేనేం తక్కువ అన్నట్లు తమిళ 'తమ్ముడు'  కార్తి కూడా వస్తున్నాడు.'ఖైదీ'తో కార్తికి వచ్చిన క్రేజ్‌ని మళ్లీ ఇలా 'తంబీ'తో క్యాష్‌ చేసుకోవాలనుకుంటున్నారు కాబోలు. చూడాలి మరి, 'ఖైదీ' మ్యాజిక్‌, 'తంబి' రిపీట్‌ చేస్తాడో.? లేదో.?


మరింత సమాచారం తెలుసుకోండి: