కోలీవుడ్ హీరో విశాల్ మీద బయ్యర్లు భారీ పందెం కాస్తున్నారు. ఈ హీరో న్యూ మూవీ యాక్షన్ తెలుగు రైట్స్ రేట్ టాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ తమిళ తంబీ భారీ హిట్ కొడితే తప్పా బయ్యర్లు సేఫ్ అవ్వడం కష్టమే అంటున్నారు. మరి విశాల్ యాక్షన్.. ఆడియన్స్ ని మైండ్ బ్లోయింగ్ చేస్తుందా.. బయ్యర్లను ఒడ్డున పడేస్తోందా..? 


తమిళస్టార్ విశాల్ తెలుగులో సక్సెస్ కొట్టి మూడేళ్లు దాటుతోంది. మరో సూపర్ హిట్ ఇస్తుందనుకున్న పందెం కోడి 2 నిరాశపరిచింది. అంతకుముందు వచ్చిన రాయుడు సినిమా సైతం తెలుగు ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. అయితే ఈ ఫ్లాప్స్ ఏం తన కొత్త సినిమా బిజినెస్ మీద ఎఫెక్ట్ చూపకపోవడం విశేషం. విశాల్ అప్ కమింగ్ మూవీ యాక్షన్ తెలుగు రైట్స్ రేట్ కు సంబంధించి టాలీవుడ్ సర్కిల్స్ హాట్ హాట్ డిస్కషన్స్ నడుస్తోంది. 


విశాల్ నటించిన అప్ కమింగ్ మూవీ యాక్షన్ రిలీజ్ కు రెడీగా ఉంది. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి పి.సుందర్ దర్శకత్వం వహించాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 15న రిలీజ్ కాబోతోంది. విశాల్ నివ్వెర్ బిఫోర్ అనే రేంజ్ లో యాక్షన్ స్టంట్స్ తో ఇరగదీసినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమా తెలుగు రైట్స్ ఓ పేరు బయ్యర్ 8కోట్లకు తీసుకోవడం ఆసక్తిగా మారింది. 


ఈ మధ్య రిలీజైన విజయ్ డబ్బింగ్ మూవీ విజిల్ రైట్స్ సైతం 6 నుండి 7 కోట్ల మధ్య అమ్ముడు పోయినట్టు వినిపించింది. ఇప్పుడు విశాల్ మూవీ అంతకు రెట్టింపు అమ్ముడుపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. విశాల్ లాస్ట్ హిట్ అభిమన్యుడు సినిమాలో తెలుగులో 9కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఆ సినిమాను మించి భారీ సక్సెస్ కొడితేనే యాక్షన్ రైట్స్ తీసుకున్న బయ్యర్లు సేఫ్ అవుతారు. మరి విశాల్ యాక్షన్ తెలుగు ఆడియన్స్ ను ఏ మేరకు సర్ ప్రైజ్ చేస్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: