యంగ్ హీరో శ్రీవిష్ణు – నిక్కీ తంబోలి హీరోహీరోయిన్లుగా వచ్చిన చిత్రం తిప్ప‌రా మీసం. కృష్ణ విజ‌య్‌.ఎల్ ద‌ర్శ‌క‌త్వంలో ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది.  చిన్న చిన్న సైడ్ క్యారెక్ట‌ర్లు చేస్తూ మంచి క్లాస్ పాత్ర‌ల్లో న‌టిస్తూ చిన్నగా హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు శ్రీ‌విష్ణు.  త‌ను ఎంచుకునే పాత్ర‌లు చాలా డిఫ‌రెంట్ గా ఉంటాయి.  ఆయ‌న న‌టించే చిత్రాల్లో దాదాపుగా ఆయ‌న చాలా సైలెంట్‌గా డైలాగులు ఎక్కువ లేకుండానే ఆయ‌న హావ భావాల‌తోనే సీన్‌ని ర‌క్తిక‌ట్టిస్తుంటారు. అలాంటి శ్రీ విష్ణు బ్రోచేవారు ఎవ‌రు చిత్రం మంచి హిట్ అయింది. ఆ త‌ర్వాత రామ్‌తో క‌లిసి న‌టించిన చిత్రంలో కూడా ఓ ఫ్రెండ్ క్యారెక్ట‌ర్‌లో ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. క్లాస్ పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకునేవారు. అలాంటిది ఒక‌టేసారి మాస్‌పాత్ర‌లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పిద్దామ‌నుకున్నారు. పాత్ర‌ను ఎంచుకోవ‌డం వ‌ర‌కు ఓకే అయినా ఆయ‌న పాత్ర పూర్తి నెగిటివ్ కావ‌డం ఒక ఎత్తైతే క‌థ‌లో మంచి కంటెంట్ లేక‌పోవ‌డం రెండో ఎత్త‌యింది. ఈ చిత్రంలో ఆయ‌న గెట‌ప్‌కి మంచి హైప్ వ‌చ్చినా సినిమా మాత్రం ఆశించినంత ఫ‌లితం రాలేదనే చెప్పాలి. 

చిన్నతనంలోనే మాదక ద్రవ్యాలకు అలవాటు పడి దారి తప్పిన కుర్రాడు. తనను దారిలోకి తేవడం కోసం రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టించి తనకు దూరంగా ఉన్న తల్లి మీద ద్వేషం పెంచుకున్న మణి.. పూర్తిగా కుటుంబానికి దూరమై తన దారిన తాను బతుకుతుంటాడు. ఒక పబ్ లో డీజేగా పని చేస్తున్న మణి.. బెట్టింగులు చేయడం వల్ల అప్పుల్లో కూరుకుపోయి.. ఒక దశలో తల్లి మీదే కేసు వేసే పరిస్థితికి దిగజారుతాడు. మరి ఈ కేసు ఎలాంటి పరిణామాలకు దారి తీసింది? మణి ఎప్పటికైనా మారాడా లేదా? అతను గర్వంతో మీసం తిప్పే సందర్భం జీవితంలో ఎప్పటికైనా వచ్చిందా లేదా అన్నది మిగతా కథ.


మరింత సమాచారం తెలుసుకోండి: