ప్రస్తుతం వెండితెరతో పాటు బుల్లితెరపై వస్తున్న నటులు కూడా ఎంతో మంచి పేరు సంపాదిస్తున్నారు. వరుసగా టెలివిజన్ ఛానల్స్ పెరగడం, దానితో పాటు ఆయా ఛానల్స్ మధ్య పోటీ కూడా పెరగడంతో రకరకాల వెరైటీ ప్రోగ్రామ్స్ తో వీక్షకులను ఆకట్టుకునేలా ఎవరికి వారు సరికొత్త ప్రోగ్రామ్స్ ని రూపొందిస్తున్నారు. దాని వలన బుల్లితెరపై యాంకర్స్ గా ఆకట్టుకునే ప్రోగ్రామ్స్ తో పేరు సంపాదిస్తూ మెల్లగా వెండితెరపై కూడా సందడి చేస్తూ దూసుకుపోతున్న వారున్నారు. ఇక అటువంటి వారిలో యాంకర్ ప్రదీప్ కూడా ఒకరు. స్టార్ మహిళ, గడసరి అత్త సొగసరి కోడలు, ఎక్స్ ప్రెస్ రాజా, ఢీ జోడి, కొంచెం టచ్ లో ఉంటాను, ప్రదీప్ పెళ్లిచూపులు వంటి షోస్ ద్వారా ఎంతో పాపులరై, 

మంచి ప్రేక్షాభినంతో వెండితెరపై అక్కడక్కడా కొన్ని సినిమాల్లో కూడా నటిస్తున్నాడు ప్రదీప్. అయితే ఆ మధ్య డ్రంకెన్ డ్రైవ్ కేసులో దొరికి కొంత సమస్యలు ఎదుర్కొన్న ప్రదీప్, ఆ తరువాత మళ్ళి మంచి అవకాశాలతో పుంజుకున్నాడు. ఇకపోతే ఇటీవల కొద్దిరోజులుగా ఆయన ఏ ఛానల్ లో కూడా కనపడకపోవడంతో కొందరు వీక్షకులు ఆయనకు ఏమైనా అయిందా అంటూ సందేహం వ్యక్తం చేయడం మొదలెట్టారు. ఇక ఇటీవల మరొక యాంకర్ రవి, ప్రదీప్ కు కొంత ఆరోగ్య సమస్య కారణంగా కొన్నాళ్ల నుండి ప్రోగ్రామ్స్ చేయడం లేదు. అయితే అతి త్వరలో మళ్ళి అతడు మిమ్మల్ని అలరిస్తాడు అని చెప్పడం జరిగింది. దానితో అతడికి ఏదో పెద్ద ఆరోగ్య సమస్య ఏర్పడింది అంటూ పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు పుకారయ్యాయి. అయితే వాటన్నిటికీ చెక్ పెడుతూ, 

నేడు ప్రదీప్ ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. వాస్తవానికి తనకు పెద్ద ఆరోగ్య సమస్య ఏమిలేదని, అయితే కొద్దిరుల క్రితం యాక్సిడెంట్ జరిగి తన కాలికి కొద్దిపాటి గాయం అయిందని తన ప్రస్తుత పరిస్థితి గురించి సంచలన నిజాన్ని బయట పెట్టారు. కాగా ప్రస్తుతం తన కాళీ గాయం చాలావరకు తగ్గిందని, డాక్టర్లు కూడా మరికొద్దిరోజుల్లో షూటింగ్స్ చేయవచ్చని చెప్పారని అన్నారు ప్రదీప్. దీనితో ఆయనపై వస్తున్న పుకార్లకు ఒక్కసారిగా చెక్ పడింది. మరి అతి త్వరలో ఆయన కోలుకుని మళ్ళి టివి షోలో పాల్గొని వీక్షకులను అలరించాలని కోరుకుందాం.... !!


మరింత సమాచారం తెలుసుకోండి: