గత ఏడాది కన్నడంతో పాటు, బాలీవుడ్ సహా పలు ఇతర భారతీయ భాషల్లో రిలీజ్ అయి దేశవ్యాప్తంగా కూడా అందరు ప్రేక్షకుల మన్ననలు పొందిన సినిమా కెజిఎఫ్. యువ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాక్ స్టార్ యాష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా హోంబలె ప్రొడక్షన్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించబడిన ఈ సినిమాను కోలార్ గనుల నేపథ్యంలో చిత్రీకరించారు. ఇక ఈ సినిమాలో హీరోయిజాన్ని మరొక రేంజ్ లో చూపించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కు, అలానే తన ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులను రంజింపచేసిన హీరో యాష్ కు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు. ఇకపోతే ఈ సినిమాలో భారీ సెట్టింగులు, విజువల్స్, యాక్షన్ సీన్స్ మరియు ఫైట్స్ వంటివి మరింత ప్రధానాకర్షణగా నిలిచాయని చెప్పాలి. 

అలానే ఈ సినిమాలోని కీలక సీన్స్ లో పబ్ లో జరిగే సీన్ ఒకటి. అయితే ఆ సిన్ లో హీరోను విలన్లు చుట్టుముట్టగా వారి మాటలు విని సైలెంట్ గా అక్కడినుండి వెళ్ళిపోయిన హీరో, ఒక్కసారిగా ఒక పెట్రోల్ టాంకర్ ని తెచ్చి ఆ ప్రాంతం అంతా పెట్రోల్ తో నింపేస్తాడు. అయితే ఆ సీన్ ద్వారా హీరో యొక్క  ధైర్యసాహసాలు వారందరికీ తెలుస్తాయి. కాగా నేడు ఇదే సీన్ పై సోషల్ మీడియా మాధ్యమాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అదేమిటంటే, కొన్నేళ్ల క్రితం ప్రభాస్, త్రిష హీరో హీరోయిన్స్ గా శోభన్ దర్శకత్వంలో సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన సినిమా వర్షం. ఆ సినిమాలో పెట్రోల్ బంక్ సీన్ మంచి హైలైట్ సీన్ అని చెప్పాలి. అయితే ఆ సీన్ లో హీరో ప్రభాస్ తనతో పాటు విలన్ గోపీచంద్ సహా మిగతా విలన్స్ అందరి మీద పెట్రోల్ పోసి, 

నేను శైలు కోసం పది సార్లు చస్తాను, నువ్వు ఒక్కసారి చావగలవా, రెడీనా అంటూ తన ధైర్య సాహసాలను చూపిస్తాడు. కాగా ఈ సీన్ ని కొంత మార్చి ప్రశాంత్ నీల్ తన కెజిఎఫ్ లో పబ్ సీన్ తీసారని, ఒకరకంగా మన వర్షం సినిమాలోని ఈ సీన్ ని ప్రశాంత్ కాపీ కొట్టారని కొందరు నెటిజన్లు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొన్ని సీన్స్ ని పోలి మరికొన్ని సినిమాల్లోని సీన్స్ ఉండడం సహజమని, కాబట్టి వాటిపై వచ్చే ఈ విధమైన కామెంట్స్ పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదంటున్నారు కొందరు సినీ విశ్లేషకులు.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: