గతంలో ప్రాంతీయ భాషా చిత్రాలు ఆ ప్రాంతానికే పరిమితమవుతూ ఉండగా, ఒక్క బాలీవుడ్ సినిమాలే దేశ వ్యాప్తంగా అంటే పాన్ ఇండియా సినిమాగా విలసిల్లేవి. కాని బాహుబలి ద బిగినింగ్, బాహుబలి ద కన్‌క్లూజన్‌ రాజమౌళి నిర్మించి అద్భుత విజయాన్ని సాధించిన దరిమిలా పాన్ ఇండియా సినిమాలపై దక్షిణాది దృష్టి విపరీతంగా పెరుగుతోంది.


బాహుబలి ద బిగినింగ్, బాహుబలి ద కన్‌క్లూజన్‌ తో సౌత్ సినిమాను విశ్వవిఖ్యాతం చేసి టాలీవుడ్ దిశదశను మార్చి సుదూర తీరాలకు, ఎవరికీ అందనంత ఎత్తులో కూర్చోబెట్టాడు దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. అయితే ఆ తరువాత వచ్చిన  2.0, సాహో, సైరా వంటి భారీ చిత్రాలూ సౌత్ సినిమాకు ఒక స్థాయిని క్రియేట్ చేసే ప్రయత్నాలే  కాని - రెండున్నర సంవత్సరాలు గడిచినా ఆ స్థాయిని చేధించలేక పోయింది మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమ. ఇందులో ఉత్తరాది బాలీవుడ్ కూడా ఉంది.


బాహుబలి నెలకొల్పిన ఆ మైలు రాళ్ళను చేరలేకపోయింది పాన్ ఇండియా సినిమా. పాన్ ఇండియా సినిమాను మరో మెట్టెక్కించే సినిమా దక్షిణ భారతాన మరోమారు కోలీవుడ్ లో రూపుదిద్దుకుంటోంది.


కోలీవుడ్ సినిమా కీర్తి ప్రతిష్టలను ఒక నాడు పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్ళిన ప్రసిద్ధ తమిళ దర్శకుడు మణిరత్నం మస్తిష్కం నుంచి రూపుదిద్దు కుంటున్న ఆ చిత్రంమే "పొన్నియన్ సెల్వన్" అంటే పొన్ని కుమారుడు లేదా కావేరి పుత్రుడు అని అర్ధం - చోళ రాజ్య పాలన నేపధ్యంలో వీరుడైన ఈయన అసలు పేరు అరుల్మోజివర్మన్ కథను సినిమాకు ఆధారంగా ఉండనుంది. చోళ రాజవంశం పది పదకొండు శతాబ్ధాలలో ఈ దేశాన్ని సరిహద్దులను దాటి పరిపాలించింది. దాని మూల పురుషుడే పొన్నియన్ సెల్వన్ లేదా అరుల్మోజి వర్మన్. రాజ్యాభిషేకం తరవాత ఇతనే రాజరాజ చోళ సార్వబహుముడుగా ప్రసిద్ధుడయ్యాడు.


చోళ సామ్రాజ్యం 13 వ శతాబ్దం వరకు ప్రధానంగా దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన తమిళ సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యం కావేరి నది పరీవాహక ప్రాంతంలో పుట్టి దక్షిణ భారతదేశం అంతా విస్తరించింది. కరికాళ చోళుడు, రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడు, కుళోత్తుంగ చోళుడు చోళ రాజులలో ప్రముఖులు. చోళ సామ్రాజ్యం 10,11,12,13 శతాబ్దంలో ఉచ్ఛస్థితిని అనుభవించింది. మొదటి రాజ రాజ చోళుడు మరియు అతని కుమారుడు రాజేంద్ర చోళుడు కాలంలో చోళ సామ్రాజ్యం ఆసియా ఖండంలోనే సైనికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా చాలా అభివృద్ధి పొందింది.


చోళ సామ్రాజ్యం దక్షిణాన మాల్దీవులు నుండి ఉత్తరాన ఇప్పటి ఆంధ్ర ప్రదేస్ లోని  గోదావరి పరీవాహక ప్రాంతం వరకు విస్తరించింది. రాజరాజ చోళుడు భారతదేశంలోని దక్షిణ ద్వీపకల్ప భాగాన్ని, శ్రీలంకలోని కొన్ని భాగాలు, మాల్దీవులుకి తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. రాజేంద్ర చోళ ఉత్తర భారతదేశం మీద విజయయాత్ర చేసి పాటలీపుత్రంరాజధానిగా పరిపాలిస్తున్న పాల రాజు మహిపాలుడిని జయించాడు. తరువాత "మలయా ద్వీప సమూహం" (మలయ్ ఆర్కిపెలగో) వరకు కూడా చోళ రాజులు జైత్రయాత్రలు జరిపారు.


ఇప్పుడు ఆ కథ మణి మస్తిష్కంలో - కన్‌క్లూజన్‌ కు చేరుకోగా  ప్రీ-ప్రొడక్షన్స్ కార్య్క్రమాన్ని పూర్తి చేసే పనిలో మునిగిపోయాడు. ఇదీ 'భారీ కథ కావడంతో - బహుబలి మాదిరి గానే రెండు భాగాల సినిమాగా తెరకెక్కించే ఆలోచనలో మణిరత్నం ఉన్నాడన్న సమాచారం లీకైంది. 


డిసెంబర్ లో 'థాయిలాండ్' వేదికగా ఈ సినిమాను వైభవోపేతంగా ప్రారంభించే అవకాశం ఉందని కల్కి కృష్ణమూర్తి రాసిన 2400 పేజీల ఐదుబాగాల భారీ గ్రందం ‘పొన్నియన్ సెల్వన్’ నవల.  ఆ నవల  ఆధారంగా  తెరకెక్కుతోన్న “చారిత్రాత్మిక-జానపద” చిత్రమిదని వార్తలు వస్తున్నాయి. దక్షిణ భారతాన్ని చోళులు పాలించిన కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన గొప్ప ఉన్నతుడైన రారాజు కథగా సినిమా ఉంటుందని అంటున్నారు.


చియాన్ విక్రమ్, జయం రవి, ఐశ్వర్య రాయ్, కీర్తి సురేష్, అశ్విన్, ఆది పినిశెట్టి లాంటి భారీ తారాగణం ఈ ప్రాజెక్టు లో భాగం కానున్నారు. దృశ్య కావ్యంగా రూపొందే ఈ హిస్టారిక్  ఫోక్లోర్ ఇతివృత్తం - పీరియాడిక్ డ్రామాలో టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్‌ బాబు, ఐశ్వర్యకు భర్త పాత్రలో కనిపించ వచ్చన్న ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తోన్న సౌత్‌ సినిమా మరో "బాహుబలి స్థాయి చిత్రం" కావొచ్చన్నది చిత్ర విశ్లేషకుల మాట.

 

 

  


మరింత సమాచారం తెలుసుకోండి: