మురగదాస్ దర్శకత్వంలో మహేష్ నటించిన ‘స్పైడర్’ ఘోర పరాజయం చెందినా మహేష్ ఆ విషయాలను పక్కకు పెట్టి రజినీకాంత్ మురగదాస్ ల ‘దర్బార్’ మూవీని ప్రమోట్ చేయడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా మహేష్ తనకు భయంకరమైన ఫెయిల్యూర్ లు ఇచ్చిన దర్శకుల వైపు కన్నెత్తి కూడ చూడడు అన్నప్రచారం ఎప్పటి నుంచో ఉంది.

అయితే ఈ తీరుకు భిన్నంగా మహేష్ రజినీకాంత్ నటిస్తున్న ‘దర్బార్’ మూవీ పోస్టర్ ను రిలీజ్ చేయడం అందరికీ షాక్ ఇస్తోంది. తన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో పోటీగా విడుదల అవుతున్న ‘దర్బార్’ జనవరి 15 సంక్రాంతి రోజున విడుదల కాబోతోంది. 

అయితే ఈ పోటీని కూడ లెక్క చేయకుండా మహేష్ ఇలా మురగదాస్ కోసం ముందుకు రావడం ఇండస్ట్రీలో ఒక మంచి సాంప్రదాయానికి తెర తీసినట్లు అవుతుంది అంటూ కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని లోతుగా పరిశీలిస్తున్నవారు మాత్రం ‘దర్బార్’ రిజల్ట్ బట్టి మహేష్ మురగదాస్ తో మరొక సినిమాను వచ్చే ఏడాది చేసే ఆలోచనలు చేస్తున్నాడా అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. 

ఈ విషయాల పై రకరకాల అభిప్రాయాలు ఉన్నా మురగదాస్ మహేష్ ల మధ్య సాన్నిహిత్యం ఇప్పటికీ కొనసాగుతోంది అన్న సంకేతాలు ఈ సంఘటన రుజువు చేస్తోంది. మహేష్ ఎప్పటి నుంచో కోలీవుడ్ లో తన మార్కెట్ పెంచుకోవడానికి చాల ఆలోచనలు చేస్తున్నాడు. ‘స్పైడర్’ ప్రమోగం వికటించినా ఇంకా మహేష్ కు కోలీవుడ్ మార్కెట్ ఫై మోజు పోలేదు అన్న విషయాన్ని ఈ లేటెస్ట్ సంఘటన రుజువు చేస్తోంది అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ విషయాలు పక్కకు పెడితే ప్రస్తుతం టాలీవుడ్ మార్కెట్ లో క్రేజ్ ను కోల్పోయిన రజినీకాంత్ కు మహేష్ ప్రమోషన్ ఎంతవరకు సహకరిస్తుందో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: