విక్టరీ వెంకటేశ్, యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోలుగా రూపొందుతోన్న చిత్రం `వెంకీమామ`. కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ) ద‌ర్శ‌కుడు. సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ప‌తాకాల‌పై డి.సురేష్‌బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ సాంగ్‌ను తొలిసాంగ్‌గా చిత్ర యూనిట్ సోష‌ల్ మీడియా ద్వారా విడుద‌ల చేసింది. ఈ సాంగ్‌కు ప్రేక్ష‌కుల నుండి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్ప‌టికే వ‌న్ మిలియ‌న్ వ్యూస్‌తో యూ ట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది.


ఈ సాంగ్ మామ‌, అల్లుడు మ‌ధ్య ఉండే అంద‌మైన అనుబంధాన్ని తెలియ‌చేస్తుంది. మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో టైటిల్ సాంగ్‌ను శ్రీకృష్ణ అద్భుతంగా పాడారు. సింపుల్‌, అర్థ‌మ‌య్యేలా ఈ పాట సాహిత్యాన్ని రామ‌జోగ‌య్య‌శాస్త్రి అందించారు. రాశీ ఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.


‘అమ్మైనా, నాన్నైనా నువ్వేలే వెంకీమామా.. నా ధైర్యం, నా సైన్యం నువ్వేలే వెంకీమామా’ అంటూ సాగే ఈ పాట మామా అల్లుళ్ల బంధం గురించి చెప్పడంతో పాటు కాస్త గుండె బరువుతో పాటు ఇంకాస్త కంటి చెమ్మను కూడా కలిగిస్తుంది.. సంగీతం : థమన్, కెమెరా : ప్రసాద్ మూరెళ్ల, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, నిర్మాతలు : సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్. ఈ చిత్రాన్ని తాజా  సమాచారం ప్రకారం సంక్రాంతి కంటే ముందే విడుదల చేయాలని అనుకుంటున్నారట. డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారట. విభిన్నమైన కథాకథనాలతో పూర్తి వినోదభరితంగా ఈ సినిమా సాగనుంది. 


వెంక‌టేశ్‌, నాగ‌చైత‌న్య‌, రాశీఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం:  కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ) నిర్మాత‌లు:  సురేష్‌బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, బ్యానర్స్:  సురేష్ ప్రొడక్ష‌న్స్‌,  పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కో ప్రొడ్యూస‌ర్‌:  వివేక్ కూచిబొట్ల‌, మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌, కెమెరా:  ప్ర‌సాద్ మూరెళ్ల‌, ఎడిట‌ర్‌: ప‌్ర‌వీణ్ పూడి, పి.ఆర్‌.ఒ:  వ‌ంశీ శేఖ‌ర్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: