ఎంతమంది హీరోలు, నటులున్నా దగ్గుబాటి రానా కు ఉన్న ఫాలోయింగ్ మాత్రం ప్రత్యేకం. చేసినవి తక్కువ సినిమాలే ఐనా సినిమా ఇండస్ట్రీలో మాత్రం తనకంటు ఓ ప్రత్యేక స్దానాన్ని సంపాదించుకున్నారు. ఇకపోతే ఈ మధ్యకాలంలో రానా ఆరోగ్యం గురించి రకరకాలుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. వాటిని నిజం చేస్తూ ఇప్పుడో విషయం బయట పడింది. అదేమంటే రానా దగ్గుబాటి ఇటీవలే తన కిడ్నీ ప్రాబ్లమ్ ని క్లియర్ చేసుకొని ఇండియా కి వచ్చారట.


ఈ సందర్భంగా ఆయన సన్నిహితులు రానాకు హెల్త్ ఇష్యూ వచ్చిందా అంటే నిజమే అంటున్నారు. కిడ్నీస్ ఫెయిల్యూర్ అవ్వడంతో రానాకి ఓ కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ చేశారట. దీనివల్ల కొద్దీ రోజులు చికిత్స తీసుకొని కాస్త సెట్ అయ్యాక ఇండియా వచ్చారట. కానీ డాక్టర్స్ స్ట్రిక్ట్ గా బయట ఎక్కువ తిరగద్దని, ముఖ్యంగా డస్ట్, పొల్యూషన్ ని, అలాగే షూటింగ్స్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేయమని, చెప్పారట కానీ ఇండియాలో కొన్ని కారణాలవల్ల పలు కార్యక్రమాల కోసం తిరుగుతున్న రానా మళ్ళీ అనారోగ్యంగా ఉన్నాడట.


ఇకపోతే షూటింగ్స్ చేయద్దు అన్నారనే కారణంగానే ఆయన కమిట్ అయిన సినిమాల షూటింగ్స్ అన్నీ కొంతకాలం ఆపమన్నారట. ఇలా మాటి మాటికి హెల్త్ ప్రాబ్లమ్ వస్తుండడంతో రానా ఫ్యామిలీ హెల్త్ విషయంలో చాలా కేర్ తీసుకోమని తనకి సూచిస్తున్నారట. కానీ తను కమిట్ అయిన చిన్న చిన్న వర్క్స్ త్వరగా ఫినిష్ చేయాలని ఇప్పుడు రానా చూస్తున్నారట. టీమ్స్ మాత్రం రానా హెల్త్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి మరికొద్ది రోజులు వెయిట్ చేస్తామని చెబుతున్నారట.


మరి త్వరలోనే కంప్లీట్ గా హెల్త్ కేర్ తీసుకొని ఫుల్ ఫామ్ లో రానా షూటింగ్స్ లో పాల్గొంటారా లేదా సినిమాలకు దూరంగా ఉంటారా అనే ఆలోచనతో రానా అభిమానులు ఫీలవ్వుతున్నారట. కాని ఆరోగ్యం సహకరించకుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి ముందుగా హెల్త్ ముఖ్యం కదా అందుకే రానా కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంటేనే మంచిదంటున్నారు ఆయన మేలుకోరే సన్నిహితులు..



మరింత సమాచారం తెలుసుకోండి: