ఏ హీరోకైనా వరుసగా బ్లాక్ బస్టర్స్ పడితే లక్కీ ఫెలో అంటారు. కానీ కార్తీక్ ఆర్యన్ ని అమ్మాయిల విషయంలో లక్కీ ఫెలో అంటోంది బాలీవుడ్. ఈ హీరోలో ఏ మ్యాజిక్ ఉందోగానీ హీరోయిన్లు చూడగానే అతనికి పడిపోతున్నారని కామెంట్స్ చేస్తున్నారు. 


కార్తీక్ ఆర్యన్ టాలెంట్ కు బాలీవుడ్ అంతా ఆశ్చర్యపోతోంది. సినిమాకు ఓ హీరోయిన్ ని లైన్ లో పెడుతున్న ఈ హీరోని చూసి బీటౌన్ ప్లే బాయ్స్ విస్తుపోతున్నారు. మొదట్లో సారా అలీఖాన్ తో క్లోజ్ గా ఉన్న కార్తిక్ ఇప్పుడు అనన్య పాండేతో డేటింగ్ చేస్తున్నాడనే వార్త హాట్ టాపిక్ గా మారింది. 


కార్తీక్ ఆర్యన్ నిన్నటి వరకు సారా అలీఖాన్ తో డేటింగ్ లో ఉన్నాడని ప్రచారం జరిగింది. సారా స్టెప్ మదర్ కరీనాకపూర్ టాక్ షోలో కార్తీక్ మెరవడంతో ఇతను పటౌడీ కందాన్ కు అల్లుడైపోయాడమే కామెంట్స్ వచ్చాయి. లవ్ ఆజ్ కల్ 2 సెట్స్ లో ఇద్దరు ప్రేమలో పడ్డారనీ.. త్వరలోనే పెళ్లి చేసుకుంటారనే టాక్ వినిపించింది. సారా అలీఖాన్ కెరీర్ కోసం ఆర్యన్ తో డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం అని చెప్పిందట. అన్నట్టుగానే ఆమె గ్యాప్ మెయింటైన్ చేస్తోంది. సారా ఇచ్చిన ఈ గ్యాప్ లో అనన్యపాండేని పడేశాడట. "పతి పత్నీ ఔర్ ఓ " సెట్స్ లో అనన్యతో క్లోజ్ గా మూవ్ అయ్యాడట కార్తీక్. 


కార్తీక్ ఆర్యన్ రీసెంట్ గా ఫిల్మ్ ఫేర్ మేగజీన్ కవర్ పేజ్ గా మారాడు. ఈ ఈవెంట్ లో అనన్యతో ఎఫైర్ గురించి అడిగిన జర్నలిస్టులకు కన్ ఫ్యూజింగ్ ఆన్సర్ ఇచ్చాడు కార్తీక్. మీకు అలా వినిపిస్తోందా.. అయితే అలాగే కానివ్వండి నేను మాత్రం ఫిల్మ్ ఫేర్ తో లవ్ లో ఉన్నానని రిప్లై ఇచ్చాడు. దీంతో కార్తీక్ మాములోడు కాదనీ బాలీవుడ్ జనాలు కూడా మాట్లాడుకుంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: