శివ సినిమాతో మొదలైన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్ టు ముంబై .. ముంబై టు హైదరాబాద్ షిఫ్టింగ్ గురించి అందరికి తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ ఫ్యాక్టరీ పేరుతో ఈయన చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. వర్మ మైండ్ సెట్ ఉన్న టెక్నీషియన్స్.. సహాయ దర్శకులు.. రచయితలు ఆయనతో పాటే ట్రావెల్ చేసేందుకు ఈ ఫ్యాక్టరీలో చేరేవారు. పూరి జగన్నాధ్, శ్రీను వైట్ల, కృష్ణ వంశీ, హరీష్ శంకర్  వంటి నేటి స్టార్ డైరెకటర్స్ అక్కడి నుంచి వచ్చినవాళ్ళే. అయితే ఆర్జీవీ హైదరాబాద్ నుంచి సడెన్ గా ముంబైకి షిఫ్ట్ అయ్యి హిందీ పరిశ్రమలో సినిమాలు చేయడంతో ఇక్కడ ఫ్యాక్టరీ మూత పడిన సంగతి తెలిసిందే. నాగార్జున నటించిన 'గోవిందా గోవిందా' రిలీజ్ సమయంలో వివాదం తలెత్తడం వల్లనే వర్మ ముంబై షిఫ్టయ్యాడు. అక్కడ  ఢీ కంపెనీ వంటి కొత్త ఆఫీస్ ని ఓపెన్ చేశాడు. హిందీ పరిశ్రమలో దశాబ్ధం పైగానే వర్మ బ్రాండ్ పాపులరైంది. అక్కడ సాంకేతిక నిపుణులు ట్యాలెంటుకు మంచి అవకాశం దక్కింది. పొద్దున వర్మ లేచే సరికే నిర్మాతలు సూటికేసులు పట్టుకొని ఆయన ఆఫీస్ ముందు ఎదురు చూసేవాళ్ళు.

అలా దాదాపు 25 ఏళ్ళు ముంబైలోనే ఉన్న ఆర్జీవీ అక్కడ వరుస డిజాస్టర్లు పడడంతో అక్కడ కంపెనీని మూసేసి హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యాడు. ఆ సమయంలోనే ఇక్కడ నాగార్జున మేనల్లుడు సుమంత్ ని వెండితెరకు పరిచయం చేస్తూ ప్రేమ కథ తీశాడు. ఆ తర్వాత హిందీ పరిశ్రమలో సినిమాలు తీస్తూనే.. హైదరాబాద్ లో ఓ ఆఫీస్ ని ఓపెన్ చేశాడు. ఇక్కడ రక్త చరిత్ర లాంటి వివాదాస్పద సినిమాలని తెరకెక్కించి తనదైన మార్క్ ప్రచారంతో లైమ్ లైట్ లో కొనసాగాడు. అయితే ఐస్ క్రీమ్.. జీఎస్టీ అంటూ వర్మ చేసిన పిచ్చి ప్రయోగాలన్నీ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాయి. రీసెంట్‌గా లక్ష్మీ స్ ఎన్టీఆర్ సినిమాని లక్ష్మీ పార్వతి కోణంలో చూపించి తీవ్ర దుమారం రేపాడు. ప్రస్తుతం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ కుల రాజకీయాలు.. హత్యా రాజకీయాలపై సినిమా తీస్తున్నాడు.

అయితే ప్రస్తుతం వర్మకు హైదరాబాద్ లో ప్రత్యేకంగా ఆఫీస్ లేదట. తాజాగా సొంత ఆఫీస్ అంటూ ఈయన ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ ఫోటో వైరల్ గా మారింది. ఈ కొత్త ఆఫీస్ పేరు 'కంపెనీ'. ఆ ఫోటోలో ఆఫీస్ ఎంతో క్రియేటివ్ గా కనిపిస్తోంది. సైకిల్ చైన్.. తుపాకి కనిపిస్తుండడంతో ఆఫీస్ వర్మ మార్క్ లో ఉందన్న ప్రశంసలు అందుకుంటున్నాడు. హైదరాబాద్ లో కొత్త ఆఫీస్ ఫోటోలో క్రియేటివిటీ బాగానే ఉంది. కానీ.. సినిమాల్లోనూ అంతే క్రియేటివ్ గా ఆయన ఏ సినిమాలు తీయబోతున్నారు అన్నది ఇప్పుడు ఇంపార్టెంట్. ఆర్జీవీ తన స్థాయికి తగ్గ సినిమాలు తీయడం లేదని చాలా కాలంగా విమర్శిస్తున్నారు. ఇప్పుడైనా తన మైండ్ సెట్ మార్చుకొని కాంట్రవర్సీలకు పోకుండా మంచి కథలతో సినిమాలు తీస్తారేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: