రష్మీ గౌతమ్ ఎంత ఫేమస్ అయ్యిందంటే.. ఆమె ఎం చేసినా అది ఒక పెద్ద సంచలనం అవుతుంది. ప్రస్తుతం అయోధ్య భూ వివాదంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై దేశవ్యాప్తంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ సందర్బంగా జబర్దస్త్ యాంకర్ రష్మీ ట్విట్టర్ లో ఈ తీర్పు పై స్పందిస్తూ 'జై శ్రీరామ్' అంటూ పోస్ట్ పెట్టింది. దీనితో రష్మీ అభిమానాలు ఈ పోస్ట్ కి తెగ లైక్స్ కొడుతున్నారు. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్ కూడా అవుతుంది. అయితే ఈ ట్వీట్ ని కొందరు నెగటివ్ తీసుకొని ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేస్తున్నారు. 


అయితే ఒక నెటిజెన్ రష్మీ ట్వీట్ కి రిప్లై ఇస్తూ.. "మేడం, ఇటువంటి ట్వీట్స్ ని పెట్టేముందు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాపీల్ని సరిగా చదవాలి. బాబ్రీ మసీదు కట్టి ముస్లింలు తప్పు చేశారని నీ ఉద్దేశ్యమా? అని ప్రశ్నించాడు. 


ఇంకో వ్యక్తి అతని రిప్లై ని సమర్థిస్తూ... 'ఈ బాలీవుడ్ టాలీవుడ్ వాళ్ళు డబ్బులు తీసుకొని ఈ ట్వీట్స్ చేస్తారు.' అనడంతో.... రష్మీ ఘాటుగా స్పందించింది. 
'అవునా.. మీలాంటి మొహం చూపించే ధైర్యం లేనివాళ్లే నేను దీపావళికి క్రాకర్స్‌ను కాల్చొద్దని చెబితే... హిందూ వ్యతిరేకిని అని అన్నారు..ఇప్పుడేమో ఇలా అయోధ్య తీర్పుని సపోర్ట్ చేసి నిమిషం అవుతుందో లేదో.. ఆర్ఎస్ఎస్ అనుకూలవాదినని అంటున్నారు. మీకు చెప్పాలంటే.. బక్రీద సమయంలో కూడా జంతువుల్ని హింసంచకూడదని నేను ట్వీట్ చేశాను, ' అంటూ రష్మీ తాను ఏ మతానికి వ్యతిరేకిని కాదంటూ మండిపడ్డారు. 


రష్మీ గౌతమ్ కి సామాజిక అంశాల పై ట్వీట్స్ చేయడం ఇదేం మొదటి సారి కాదు. తమిళనాడులో బోరుబావిలో రెండేళ్ల చిన్నారి పడిపోయినప్పుడు కూడా రష్మీ ట్విట్టర్ వేదికగా స్పందించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: