రష్మిక సూపర్ స్టార్ మహేష్  పక్కన నటిస్తున్న సూపర్ స్టార్ హీరోయిన్. ఆమె రేంజి ఇపుడు ఒక్కసారిగా పెరిగిపోయింది. వరసగా చేతిలో సినిమాలు కూడా  ఉన్నాయి. హిట్లూ ఫట్లుతో సంబంధం లేకుండా రష్మిక జోరు అలా హ్యాపీగా  సాగిపోతోంది. దాంతో అమ్మడు తెగ హుషార్ చేస్తోంది. ఆమె కొత్త మూవీ మహేష్ బాబుతో చేస్తున్న సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి కి రిలీజ్ అవుతోంది. ఈ మూవీ మీద రష్మిక పెద్ద ఆశలే పెట్టుకుంది.


ఇక సరిలేరు నీకెవ్వరు లో మహేష్ బాబు లుక్స్ బయటకు వచ్చేశాయి. రాములమ్మ లేటెస్ట్ పిక్ కూడా రివీల్ చేశారు. ఇక రావాల్సింది రష్మిక పోస్టరే. రష్మిక ఈ మూవీలో ఎలా వుంటుంది. ఆమె రోల్ ఏంటి అన్న ఆత్రుత్ర ఫాన్స్ లో ఉంది. ఇక మహేష్ బాబుకు జోడీగా ఆమె ఎలా నప్పిందన్న ఆసక్తి కూడా ఉంది. దీంతో రష్మిక స్టిల్స్ కోసం మొత్తానికి మొత్తం ఇక్కడ వెయిటింగ్ అంటున్నారు ఫ్యాన్స్.  రిలీజ్ కి ఇంకా రెండు నెలల టైం ఉన్నా కూడా ఒక పద్ధతి ప్రకారం సినిమాల్లో టాప్ స్టార్స్ లుక్స్ బయటకు వదులుతున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి రష్మిక విషయంలో మాత్రం కొంత సీక్రెట్ పాటిస్తున్నాడు. సరైన టైంలో స‌రిలేని జోడీ లుక్స్ ని రిలీజ్ చేద్దామని అనిల్ ప్లాన్ అంటున్నారు. ప్రతీ సినిమాలో అల్లరి గా నటించే రష్మిక ఈ మూవీలో మహేష్ పక్కన ఎలా మెరిసిపోతుందన్నది సస్పెస్న్ అంటోంది చిత్ర యూనిట్.


అవన్నీ మూవీ చూసి తెలుసుకోవాల్సిందేనని అంటున్నారు. అయితే మహేష్ లాంటి అందగాడు పక్కన రష్మిక కూడా సౌందర్య రాశిగా నిలిచి గెలిచిందని అంటున్నారు. ఈ ఇద్దరి జంట కన్నుల పంటేనని కూడా అంటున్నారు. సంక్రాంతి రోజున ప్రతి ఇంట పండుగ తెచ్చేలా ఈ సరిలేరు నీకెవ్వరు మూవీ  ఉంటుందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఈ మూవీతో తన జాతకమే మారిపోయి సూపర్ స్టార్ డం వచ్చేస్తుందని రష్మిక కూడా ధీమాగా ఉంది. మరి ఆమె ఆశలు ఆడియన్స్ అంచనాలు మిక్స్ అయ్యేలా అనిల్ రావిపూడి మూవీని ఎలా డిజైన్ చేశాడో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: