సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా దర్బార్. ఈ సినిమాలో నయనతార, నివేదా థామస్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా బడ్జెట్ ఎంత? బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ వరకు వసూళ్ళు రాబట్టాలి? అంటే .. క్రిటిక్ ఎనాలిసిస్ చెబుతున్న లెక్కలు భయంకరమైన షాకిస్తున్నాయి. ఈ సినిమా కి ఏకంగా 130 కోట్ల బడ్జెట్.. దాంతో పాటు 80 కోట్ల వరకు రజనీ రెమ్యూనరేషన్ చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. 

అంటే దాదాపు బాహుబలి -1 కోసం ఆర్కా మీడియా ఖర్చు చేసినంత అని అర్థమవుతోంది. అయితే రిటన్స్ ఆ రేంజు లో తేలేకపోతేనే లైకా సంస్థకు నష్టాలు తప్పవన్న గుస గుసలు వినిపిస్తున్నాయి. రజనీతో 2.0 లాంటి భారీ బడ్జెట్ సినిమాని తెరకెక్కించిన లైకా సంస్థకు ఇంతకు ముందే పెద్ద షాక్ తగిలింది. అయినప్పటికి మొండి ధైర్యంతో మరోసారి రజనీ పై ఇంత పెద్ద బడ్జెట్ పెడుతోందా..! మురుగ దాస్ ఆ బడ్జెట్ కి తగ్గట్టు న్యాయం చేస్తున్నారా? అంటూ ఆసక్తికర చర్చ మొదలైంది. ఒకవేళ బడ్జెట్ విషయంలో వస్తున్న టాక్స్ నిజమయితే బాహుబలి రేంజులో హిట్టవుతుందా.. అంటే కష్టమనే సమాధానమే వస్తోంది. దాదాపు 250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. అయితే ఆ సినిమాతో దర్బార్ ని ఎంతమాత్రం పోల్చలేం. ఎందుకంటే ఈ సినిమా రెగ్యులర్ క్రైమ్ డ్రామా. కాప్ రోల్ కీలక భూమిక పోషిస్తోంది. అంటే ఒక వారియర్ సినిమా మైలేజ్ దీనికి వచ్చే ఛాన్సే అసలు లేదని క్లియర్ గా తెలుస్తోంది. రజనీ బ్రాండ్.. మురుగ బ్రాండ్.. లైకా బ్రాండ్ ఉన్నా ఈ సినిమా కోట్లు కొల్లగొట్టడం అంటే పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి.

ఇక రజనీ నటించిన సినిమాల్లో 2.0 తప్ప ఇంతవరకూ ఏదీ 200 కోట్ల షేర్ మార్క్ ని దాటిందిలేదు. దీంతో దర్బార్ ముందు భారీ సవాల్ ఉందని కోలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమా తెలుగు - తమిళం-హిందీ భాషలలో 2020 జనవరి 15 న రిలీజవుతోంది. ఇక ఈ సినిమాలో రజనీ మార్క్ పోలీసుని చూడబోతున్నామని ఇప్పటికే రిలీజైన  పోస్టర్లు..మోషన్ పోస్టర్ చూస్తుంటే తెలుస్తోంది. ముంబై నేపథ్యంలో సౌత్ డీజీపీ ఆఫీసర్ ఆపరేషన్ ఏమిటన్నది మురుగదాస్ తెరపై చూపించబోతున్నారు. అయితే లైకా సంస్థ దర్భార్ పై అంత పెద్ద పెట్టుబడి పెట్టడానికి కారణం తమిళ మార్కెట్ తో పాటు మలేషియా మార్కెట్ ఓ కారణం అని తాజా సమాచారం. మరి రజని మ్యానియా ఎంతవరకు దర్బార్ విషయంలో వర్కౌట్ అవుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: