శ్రియ పెళ్ళి చేసుకున్న కూడా ఇంకా గ్లామర్ ఒలకబోస్తూనే ఉంది. పైగా డోస్ బాగా పెంచేసింది. ఆమె అందానికి హద్దుల్లేవని కూడా బోల్డ్ గా చెప్పెస్తోంది. రసికప్రియుల మాటేంటి అంటే పెళ్ళి అయిన తరువాత అందం రెట్టింపు అయిందట. మరో విశేషం ఏంటంటే శ్రియ ఇంకా అవకాశాలను అందుకుంటూనే ఉంది. ఆమె కావాలని కోరుకుంటున్న హీరోలు, నిర్మాతలు ఉన్నారు. అందమే కాదు అభినయం కూడా శ్రియకు పుష్క‌లంగా ఉండడంతో ఈ సీనియర్ హీరోయిన్ ఒక వెలుగు వెలుగుతోంది.


ఇదిలా ఉండగా లేటెస్ట్ టాక్ ఏంటంటే టాలీవుడో ఓ క్రేజీ ఆఫర్ శ్రియని వరించిందట. విక్టరీ వెంకటేష్ తమిళ్ రీమేక్ అసురన్ ప్రాజెక్ట్ ని టేకప్ చేస్తున్నాడుట. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఈ మూవీ తీస్తున్నారు. ఇందులో హీరోతో పాటు హీరోయిన్ పాత్రకు కూడా ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. దాంతో సీనియర్ హీరోయిన్ శ్రియ అయితే బాగుటుందని ఆమెను సెలెక్ట్ చేశారని అంటున్నారు.


వెంకీతో శ్రియా సుభాష్ చంద్రబోస్, గోపాలా గోపాలా మూవీస్ చేసింది. దీంతో ఇద్దరి జంట హ్యాట్రిక్ కొడతారన్న మాట. ఇక శ్రియకు తెలుగులో ఈ ఆఫర్ తగలడంతో మరో మారు తన వలపు వలను ఇటువైపు విసురుతోంది. ఆమె ఇపుడు సీనియర్ హీరోల ఫస్ట్ చాయిస్ అయింది. మరో వైపు బాలయ్య లాంటి వారు కూడా ఆమెను ఎంకరేజ్ చేస్తున్నారు.


ఇపుడు అసురన్ తో మళ్ళీ హిట్ పడితే కనుక మరో కొన్నాళ్ళ పాటు శ్రియను టాలీవుడ్లో నుంచి కదిపేవారు ఉండరని అంటున్నారు. మూడున్నర పదుల వయసులో ఉన్న శ్రియ పెళ్ళి అయినా తుళ్ళి తుళ్ళి పడుతూ ఫ్యాన్స్ కి మోతెక్కిస్తోంది. అందుకే ఆఫర్లు అలా వస్తున్నాయి అంటున్నారు. చూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: