నందమూరి కుటుంబంలో మూడవ తరవం వారసుడిగా జూనియర్ ఎన్టీయార్ టాలీవుడ్లో టాప్ స్టార్ గా ఉన్నాడు. నటనతో పాటు, డ్యాన్సులు ఇరగదీస్తాడని పేరు తెచ్చుకున్నాడు, జూనియర్ ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్లు కూడా ఉన్నాయి. మెగా ఫ్యామిలీకి ధీటుగా నందమూరి వారసుల్లో జూనియర్ గట్టి పోటీ ఇచ్చే పొజిషన్లో ఉన్నాడు. ఇపుడున్న జూనియర్ కెరీర్ ని తీసుకుంటే మరో పదేళ్ళ వరకూ ఎలాంటి ఢోకా లేదని అంటారంతా. మరి ఇంతలోనే  జూనియర్ కొత్త అవతారేమేంటి.


జూనియర్ ఎన్టీయార్ సినిమాల్లో చాలా వేషాలు వేశారు, వేస్తున్నారు. ఆయన లవకుశలో  మూడు పాత్రలను  పోషించి కూడా ఆకట్టుకున్నారు. ఇక సినిమా సినిమాకు వెరైటీ చూపించడంలో కూడా తనకు సాటి లేదని చెబుతారు. ఇదిలా ఉండగా జూనియర్ తొందరలోనే నిర్మాతగా మారుతాడట. ఆయన‌ కూడా సొంత నిర్మాణం చేపడతాడట. అందుకోసం జూనియర్ ఇపుడు కసరత్తు చేస్తున్నారు. ఇపుడున్న పరిస్థితుల్లో ప్రతీ స్టార్ హీరోకు ఒక సొంత బ్యానర్ ఉంది. ఇప్ప‌టికే ప్ర‌భాస్ యు.వి.క్రియేష‌న్స్‌, రామ్‌చ‌ర‌ణ్ కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌ని, మ‌హేష్ జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ను స్టార్ట్ చేశారు. అంద‌రూ సినిమాల‌ను నిర్మిస్తున్నారు.  ఇక నందమూరి కుటుంబం వరకూ తీసుకున్నా వారికి మొదటి నుంచి రామక్రిష్ణా స్టూడియోస్ అని పెద్ద నిర్మాణ సంస్థ ఉంది. 


అందులో అన్న గారు, బాలయ్య మూవీస్ తీశారు. హరిక్రిష్ణ నిర్మాతగా వ్యవహరించేవారు. ఇక తరువాత బాలక్రిష్ణ  ఎంబీకే ఫిలింస్ పేరిట బ్యానర్ పెట్టి కధానాయకుడు, మహానాయకుడు సినిమాలు తీశారు, కళ్యాణ్ రామ్ ఎన్టీయార్ ఆర్ట్స్ బ్యానర్ మీద వరసగా  సినిమాలు తీస్తున్నాడు. ఇపుడు జూనియర్ కూడా సొంత బ్యానర్ పెడితే ఒక ఫ్యామిలీలో నాలుగు బ్యానర్లు అవుతాయి. చూడాలి మరి సొంత బ్యానర్లో అద్భుతమైన సినిమాలు తీసి తాత ఎన్టీయార్ బాటలో జూనియర్ నడుస్తాడేమో.



మరింత సమాచారం తెలుసుకోండి: