స్టార్ డమ్ అందుకున్న సినీ నటులు హీరోలుగా కొనసాగుతూనే, నిర్మాతలుగా కూడా మారిపోతున్నారు. మహేశ్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, నాని, విజయ్ దేవరకొండ సహా మరికొంత మంది హీరోలు నిర్మాతలుగా తమ ప్రయాణాన్ని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే బాటలో అడుగులు వేయాలనుకుంటున్నారట ఎన్టీఆర్‌. డాన్స్ పరంగా, నటన పరంగా, హావభావాల పరంగా అన్ని రకాలైనటువంటి ఎమోషన్స్ పండించగల నటుడు జూనియర్ ఎన్టీఆర్.


అయితే యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ చిన్న సినిమాలను ప్రోత్సహించేందుకు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలవకుశ, అరవింద సమేత.. ఇలా వరుస హిట్లతో టాప్ గేర్‌లో ఉన్న జూనియర్ ఎన్‌టీఆర్.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. అధికారికంగా ప్రకటించకపోయినా.. కొత్త ఏడాదిలో ఈ విషయంపై సరైన స్పష్టత ఇస్తారని సమాచారం. ఇక ఇప్పటికే నందమూరి ఫ్యామిలీ నుంచి రామకృష్ణ సినీ స్టూడియోస్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, ఎన్‌బీకే ఫిల్మ్స్ బ్యానర్లు ఉన్నాయి. 


ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి నాలుగో నిర్మాణ సంస్థగా ఎన్టీఆర్‌ సొంత నిర్మాణ సంస్థ ప్రారంభం కాబోతుంది. అయితే బ్యాన‌ర్‌కు ఎవ‌రి పేరు పెడ‌తారో ఇంకా స్ప‌ష్ట‌త లేదు. ఎన్టీఆర్ తాతా ఎన్టీ రామారావు పెడ‌తారా? లేదా కొడుకు అభ‌య్ రామ్‌ పేరు పెడ‌తారా? అన్న‌ది చూడాల్సి ఉంది. అలాగే ఈ బాధ్యతలను ఆయన సతీమణి చూసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఎన్టీఆర్, ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్‌. ఈ సినిమా 2020 జూలై నెలాఖరున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తుంది చిత్ర యూనిట్ దీని తర్వాత కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్న సినిమాలో నటించనున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: