అసురన్ సినిమాని తెలుగులో తీయాలనుకుంటున్నారు. ఈ సినిమా తమిళ్ లో పెద్ద హిట్. అయితే దీని మీద రామ్  చరణ్ తో పాటు చాలా మంది స్టార్ హీరోలు మోజు పడ్డారని అంటున్నారు. అయితే అసురన్ మూవీ ద్వారా మరో మారు మాస్ ఇమేజ్ కోసం ట్రై చేయాలని వెటరన్ హీరో ఒకరు అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. దాంతో ఆయన మనసు పడిన అసురన్ ని తొందరలోనే తెలుగులో తెరకెక్కించే పనులు జోరుగా సాగుతున్నాయి.


సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అసురన్ సినిమాను తీయాలని డిసైడ్ అయ్యారు. అసురన్ సినిమాలో సీనియర్ హీరో వెంకటేష్ నటిస్తున్నారు. ఆయనకు జోడీగా సీనియర్ హీరోయిన్ శ్రియ నటిస్తోంది. ఇక ఈ మూవీకి డైరెక్టర్ గా హను రాహవపూడిని సెలెక్ట్ చేశారని తెలుస్తోంది. హను రాఘవపూడి ఇంతకు ముందు అందాల రాక్షసి, క్రిష్ణ గాడి వీరగాధ,  పడి పడి లేచే మనసు చిత్రాలను తీసి మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఆయన అయితే ఈ సినిమాకు న్యాయం జరుగుతుందని భావించి తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. 



తొందరలోనే ఈ సినిమా పట్టలెక్కుతుందని అంటున్నారు. ఇదిలా ఉండగా అసురన్ మూవీ తమిళ్ ఒరిజినల్ లో  ధనుష్ చేశారు.  అక్కడ రికార్డులు బద్దలు కొట్టిన మూవీ అది. ఇక ధనుష్ తమిళ్ లో ఇంతకు ముందు చేసిన ఓ సినిమాని తెలుగులో ఆడవాళ్ళ మాటలకు అర్ధాలు వేరులే మూవీగా తీసి వెంకటేష్ పెద్ద హిట్ కొట్టాడు. అది క్లాస్ మూవీ. అసురన్ మాస్ మూవీ. దీన్ని కూడా చేసి భారీ హిట్ కొట్టాలని వెంకీ చూస్తున్నారు.  తెలుగులో కూడా అసురన్ ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో. వెంకీకి బ్లాక్ బస్టర్ ని ఇస్తుందో చూడాలి మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: