'డ్రీమ్‌' అనే ఒక డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో సినిమా తీసి ఏడు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులు ద‌క్కించుకున్న భ‌వానీ శంక‌ర్ ద‌ర్శక‌త్వంలో తాజాగా రూపొందుతోన్న సినిమా 'క్లైమాక్స్'. క్రైమ్ థ్రిల్లర్ జోన‌ర్‌లో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌, పృథ్వీ, శివ‌శంక‌ర్ మాస్టర్ కీల‌క పాత్రల్లో న‌టిస్తున్నారు. సాషా సింగ్‌, ర‌మేష్‌, చందు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఏ విష‌యాన్నైనా ధైర్యంగా ప్రశ్నించే వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఇందులో నిజ జీవిత పాత్రలో దర్శనమిస్తోంది. 

కైపాస్ ఫిల్మ్ ప్రొడ‌క్షన్ హౌస్ ప‌తాకంపై పి.రాజేశ్వర్ రెడ్డి, కె. క‌రుణాక‌ర్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమాలోని కొన్ని వర్కింగ్ స్టిల్స్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు భవాని శంకర్ మాట్లాడుతూ.. ఓ మ‌ర్డర్ మిస్టరీని పొలిటిక‌ల్ సెటైర్ నేప‌థ్యంలో కథను తయారు చేసుకున్నాం. మేం తీసుకున్న క‌థాంశం ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. అందుకు త‌గ్గట్టుగానే చిత్రీక‌రించిన విధానం కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. సినిమాలో పాత్రలు త‌క్కువ‌గానే క‌నిపిస్తాయి. కానీ ప్రతి పాత్రా హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తుంది. ప్రతి క్యారెక్టర్‌ను ప‌టిష్టంగా తీర్చిదిద్దాం...అని వెల్లడించారు.

మ‌న‌సులోని భావాల్ని నిర్భయంగా వ్యక్తం చేస్తూ, ఎదుటివారి స్థాయికి వెర‌వ‌కుండా, న‌మ్మిన సిద్ధాంతాల కోసం నిలుచునే వివాదాస్పద న‌టిగా శ్రీరెడ్డి క‌నిపిస్తారు. ఆమె రియ‌ల్ లైఫ్ క్యారెక్టర్‌కి ద‌గ్గర‌గా ఉండే పాత్ర అది. సినీ ఇండ‌స్ట్రీలో క‌నిపించే స్టీరియోటైప్ ఆలోచనలకి విరుద్ధంగా ఉండే పాత్రలు, సన్నివేశాలు మా సినిమాలో మెండుగా ఉంటాయని కూడా స్పష్ఠంగా తెలిపారు. మరి ఈ సినిమా ఎంచలనాలను సృష్ఠిస్తుందో సినిమా రిలీజైయ్యాక తెలుస్తుంది. ఇక శ్రీరెడ్డికి ఇన్నాళ్ళకు ఒక మంచి పాత్ర చేసే అవకాశం దక్కించుకుంది. ఇప్పటినుంచైనా నటిగా మంచి పాత్రలు పోషిస్తూ కొనసాగుతుందో లేదో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: