మాములుగా  పెళ్లయ్యాక చాలా మంది సినిమాలకు దూరమవుతారు. ఇల్లు సంసారం పిల్లా, పాపలతో జీవించాలని చాలా మంది అనుకోని సినిమాలకు పూర్తిగా దూరమవుతారు. అలాంటిది అక్కినేని కోడలైన సమంత సినిమాలకు మరింత దగ్గరయ్యారు. ఆమె సినిమాలకు బాగానే ఒప్పుకుంది. ముందు కన్నా కూడా పెళ్లైయ్యాక సినిమాలు ఎక్కువగా చేస్తూ వస్తుంది. పెళ్లైయ్యాక సామ్ చేసిన సినిమాలు రంగస్థలం, మజిలీ, యూ టర్న్, ఓ బేబీ సినిమాలు చేసింది. ఈ సినిమాలన్నీ ఒక్కొక్కటి

ఒక్కోవిదంగా ఉన్నాయి. ఆ సినిమాలన్నీ టాలీవుడ్ లో బాగా హిట్ అయ్యాయి. ప్రేక్షకుల మనసులో ఆ సినిమాలన్నీ బాగా చెరగని ముద్ర వేసుకుంది. ఇకపోతే ఈమెతో ఏ డైరెక్టర్ సినిమా తో సినిమా చేసిన కూడా ఆ సినిమాలన్నీ హిట్ అయ్యాయి. తాజాగా సామ్ అమెజాన్ ప్రైమ్ తెరక్కేక్కిస్తున్న వెబ్ సిరీస్ లో నటించబోతుంది. అతి పెద్ద వరల్డ్ లోకి ఎంటర్ అవుతుంది. సినిమాలలో సక్సెస్ తో దూసుకుపోతుంది.  ప్రస్తుతం ప్రపంచం అంతా డిజిటల్‌ వైపు పరుగులు తీస్తోంది. సినిమాలకు ధీటుగా వెబ్‌ సిరీస్‌లను నిర్మిస్తున్నారు దర్శక నిర్మాతలు. సమంత ఇప్పుడు నెగిటివ్ షెడ్ లో నటిస్తుంది. అదేనండి విలన్ పాత్రల్లో నటిస్తుంది. ఎప్పుడు కూల్ గా కనిపించే సామ్ ను విలన్ పాత్రలో ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా చూడాలి.


ఇది ఇలా ఉండగా సామ్ చూడటానికి సన్నగా ఉన్న కూడా ఫిట్ నెస్ విషయంలో ఎప్పుడు ముందు ఉంటుంది. ఎంత తిన్నామన్నది కాదు.. ఎంత ఫిట్ గా ఉండాలో తెలుసుకోవాలి అని సామ్ అంటుంటుంది. దానికోసం ఈమె చాలా కష్టపడుతూ వస్తుంది.. జిమ్ లో గంటల తర్పబడి ఉంటుంది. జిమ్ లో కష్టపడే వీడియోస్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలోపోస్ట్ చేస్తూ వస్తుంది. ఆమె చేసే కసరత్తులు విన్యాసాల్లాగా కనిపిస్తున్నాయి. నెగిటివ్ రోల్స్ చేయబోతుంది. ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.. 


ఇప్పుడు 96 సినిమాలో నటిస్తుంది.. ఈ సినిమా తర్వాత ఈ మందు బోల్డ్ కంటెంట్ చేయడానికి సిద్ధపడుతుంది మరి ఆ సినిమాలో బోల్డ్ పాత్రలను ఎందుకు ఎంచుకుంది అనే విషయం ఇంకా క్లారిటీ రావడంలేదు. మొన్నటి వరకు విలన్ పాత్రల్లో నటిస్తానని అన్న ఈ అమ్మడు తాజాగా అనడమే ఒక హాట్ చర్చగా మారింది. ఇప్పుడు ఇలా అనడం పై ఇంకెన్ని వార్తలొస్తాయో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: