అందాల ముద్దుగుమ్మ నివేద థామస్. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూనే తన అందం అభినయంతో ప్రేక్షకుల మతి పోగొడుతుంది ఈ అమ్మడు.
టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోల సరసన మెరిసింది అందాల
చందమామ నివేద థామస్. అయితే మొదటి నుంచి గ్లామర్ పాత్రలకు దూరంగానే ఉంది ఈ అమ్మడు. అయినప్పటికీ తన అందం అభినయం చిరునవ్వుతోనే ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇదిలా ఉండగా అప్పుడప్పుడు సెలబ్రిటీలు తమ తమ అభిమానులతో ఆన్లైన్లో
చాటింగ్ చేయడం సహజమే. సెలబ్రిటీలు అలా నెటిజన్లు తో
చాటింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి.
కొందరు ఆకతాయిలు చెత్త ప్రశ్నలు అడిగి సెలబ్రెటీలను బాగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇలా ఇబ్బంది పెట్టినప్పుడు సెలబ్రిటీలు కూడా కొన్నిసార్లు ఘాటుగానే బదులిస్తుంటారు . అయితే ఇలాంటి అనుభవమే ఎదురైంది అందాల ముద్దుగుమ్మ
నివేద థామస్ కి. తాజాగా అభిమానులతో ఆన్లైన్లో ముచ్చటిస్తున్న ఈ అమ్మడికి చేదు అనుభవం ఎదురైంది.
నివేద థామస్ ఇన్లైన్
చాటింగ్ చేస్తుండగా కొందరు నెటిజన్లు కొన్ని చెత్త ప్రశ్నలు అడిగారు. నెటిజన్లు అడిగిన ఈ ప్రశ్నలన్నిటికీ ఓపిగ్గా సమాధానం చెప్పిన నివేద థామస్... చెత్త ప్రశ్నలు లు వేసిన వారికీ కూడా ఘాటుగానే సమాధానం ఇచ్చింది . నువ్వు కన్యనేనా? ప్రేమలో పడ్డావా? నన్ను
పెళ్లి చేసుకుంటావా అంటూ నెటిజన్లు నివేదాథామస్ కొన్ని ప్రశ్నలు అడిగారు.
అయితే దీనికి నివేదాథామస్ గట్టిగానే బదులిచ్చింది. తనతో మాట్లాడేందుకు టైం కేటాయించిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూనే... కొందరు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు బదులు ఇవ్వాలంటే జాలిగా అనిపిస్తుంది అంటూ తెలిపింది నివేదా . కొంతమంది చెత్త ప్రశ్నలు అడిగిన నెటిజన్లు... వారంతా ఒక మనిషితో మాట్లాడుతున్నారని గుర్తుంచుకోవాలంటూ బదులిచ్చింది నివేద థామస్. కొంచెం మర్యాద ఇవ్వాలని ఎలాంటి ప్రశ్నలు అడగాలో తెలుసుకోవాలని సూచించారు. చెత్త ప్రశ్నలు అడిగిన వారికి నివేదాథామస్ మంచి సమాధానమే ఇచ్చిందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు .