డేరింగ్ గా మాట్లాడటం అంటే ట్రూత్ ఆర్ డేర్ ఆడినంత ఈజీ కాదు. టన్నుల కొద్దీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప భయపడకుండా మాట్లాడలేరు. నయనతార ఈ ధైర్యంతోనే ఓ టాప్ డైరెక్టర్ ని టార్గెట్ చేసింది. ఆమెకు జరిగిన అన్యాయం గురించి ప్రశ్నించింది. 


నయనతార పెద్దగా మాట్లాడదుగానీ.. చాలా ఫ్రాంక్ గా ఉంటుంది. ఎవరేమనుకుంటారో అనే మొహమాటాలు లేకుండా, ఓపెన్ స్టేట్ మెంట్ ఇస్తుంది. రీసెంట్ గా మురగదాస్ గురించి ఇలాంటి కామెంట్సే చేసింది. నయనతార రీసెంట్ గా ఓ రేడియో ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో గజినీ టైమ్ లో మురుగదాస్ ఆమెని మోసం చేశాడని స్టేట్ మెంట్స్ ఇచ్చింది. 


మురగదాస్ దర్శకత్వంలో సూర్య, ఆసిన్ లీడ్ రోల్స్ ప్లే చేసిన గజినీ సినిమాలో నయనతార మెడికల్ స్టూడెంట్ గా నటించింది. అయితే స్టోరీ నెరేషషన్ టైమ్ లో ఈ క్యారెక్టర్ ని హైలెట్ చేస్తూ చెప్పాడట మురుగదాస్. కానీ సెట్స్ కు వెళ్లాక మొత్తాన్ని మార్చేశాడట దర్శకుడు. ఇక ఎడిటింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లాక ఆ క్యారెక్టర్ ని కూడా చాలా వరకు కట్ చేసి సపోర్టింగ్ రోల్ లెవల్ కు తీసుకెళ్లారని చెప్పింది నయన్. 


గజినీ సినిమా టైమ్ లో నయనతార ఇనిషీయల్ స్టేజ్ లో ఉంది. అందుకే నయన్ క్యారెక్టర్ ని కట్ చేశారని సమాచారం. అప్పుడు సపోర్టింగ్ రోల్ కు పరిమితం చేసిన మురగదాస్ ఇప్పుడు ఈమె కాల్షీట్స్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నాడు. రజినీకాంత్ తో తీస్తున్న దర్బార్ కోసం నయన్ డిమాండ్స్ అన్నింటికీ ఒప్పుకున్నాడు. అయినా మురగదాస్ దర్శకత్వంలో నటిస్తూ మురుగదాస్ పైనే విమర్శలు చేసిందంటే.. నయన్ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే అంటున్నారు కోలీవుడ్ జనాలు.  


మరింత సమాచారం తెలుసుకోండి: