త్రివిక్రం శ్రీనివాస్ పెడితే పక్కా మాస్ టైటిల్ పెడతాడు. లేకపోతే ఫుల్ క్లాస్ రూట్లోకి వస్తాడు. అరవింద సమేత టైటిల్ జనాలకు ఎక్కుతుందా అన్న డౌట్ వచ్చింది. పైగా అక్కడ హీరో ఊర మాస్ ఎన్టీయార్. కంటెంట్ రాయల‌సీమ ఫ్రాక్షనిజం బాక్ డ్రాప్. మరి ఇవన్నీ ఎలా సెట్ అవుతాయి అన్న ప్రశ్నలకు ఆ సినిమా సూపర్ హిట్ గట్టి ఆన్సర్  చెప్పింది. 


ఇక అత్తారింటికి దారేదీ టైటిల్ దగ్గరకు వస్తే  2013లో వచ్చిన ఈ మూవీ కూడా ఓ రిస్కీ టైటిల్ తోనే అనుకున్నారంతా. కానీ రిలీజ్ అవడమేంటి అప్పటివరకూ వంద కొట్ల క్లబ్ లోకి  చేరని తెలుగు సినిమా బౌండరీస్ దాటించేసి విజేతగా నిలిచింది. సన్ ఆఫ్ సత్యమూర్తి ఈ టైటిల్ కూడా అంతే. కానీ కంటెంట్ కి టైటిల్ తో జస్టికేషన్ ఇప్పించి ఒప్పించే నేర్పు మాటల మాంత్రికుడు త్రివిక్రం సొంతం.


అందుకే ఆయన ఈ సారి సంక్రాంతికి అల వైకుంఠపురంలో అంటున్నాడు. పైగా మాస్ ఇమేజ్ ఉన్న అల్లు అర్జున్ తో మూవీ. అయితే ఇక్కడ ఒక కంఫర్ట్ ఉంది. అల్లు అర్జున్ మాస్ తో పాటు క్లాస్ కూడా బాగానే పండిస్తాడు. దాంతో ఈ మూవీ మీద అపుడే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సంక్రాంతికి గ్యారంటీ హిట్. ఇక అంతకు ముంచి ఎంత రేంజి అన్నదే ఇపుడు చర్చగా ఉంది అంతే.


ఎన్ని సినిమాలు పోటీలోకి వచ్చిన చెప్పి మరీ పెద్ద హిట్ కొట్టబోయేది మాత్రం అల వైకుంఠపురంలోనేనని అంటున్నారు. ఇదిలా ఉండగా ఈ మూవీలో త్రివిక్రం మ్యాజిక్ చాలానే ఉందంటున్నారు. సీనియర్ హీరోయిన్లను తీసుకువచ్చి వారిని సైతం హీరోయిన్ తో సమానంగా గ్లామర్ గా చూపించే త్రివిక్రం రాఘవేంద్రుని బొమ్మ టబుని ఎలా చూపిస్తాడో అన్నది పెద్ద సస్పెన్స్. ఈ క్యూరియాసిటీ చాలు మూవీ కోసం పోలోమనడానికి. అలాగే పూజా హెగ్డే అందం ఉండనే ఉంది. తమన్ ఇరగదీసే మ్యూజిక్ అపుడే హిట్ కొట్టేసింది. మొత్తానికి సంక్రాంతికి అతి పెద్ద విందు భోజనం అంటే అల వైకుంఠపురంలో అనే చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: