నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ భారీ మాస్ యాక్షన్ సినిమా సెట్స్ కు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాకోసం బోయపాటి ప్రస్తుతం హీరోయిన్లను వెతికే పనిలో ఉన్నారట. బోయపాటి సెంటిమెంట్ ప్రకారం ఎప్పటిలానే ఇద్దరు హీరోయిన్స్ ఇందులోనూ నటిస్తారట. అయితే ఆ ఇద్దరినీ వెతకడమే ఇప్పుడు బోయపాటికి కష్టంగా ఉందని తాజా సమాచారం.

బోయపాటి ఇంతకుముందు 'లెజెండ్' కోసం తనకు పరిచయం ఉన్న సీనియర్ హీరోయిన్స్ నే రిపీట్ చేశారు. ముంబై నుంచి సోనాల్ చౌహాన్ లాంటి హాట్ బ్యూటీని తీసుకు వచ్చి అల్ట్రా మోడ్రన్ గా చూపించారు. కానీ ఈసారి అలా కుదరడం లేదని ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తోంది. బాలయ్యకు ఓ హీరోయిన్ గా 27 ఏళ్ల కన్నడ బ్యూటీ రచిత రామ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్ వినిపించినప్పటికి రచిత మాత్రం తనను ఎవరూ సంప్రదించలేదని  స్వయంగా వెల్లడించింది. ఇక బోయపాటి అదే మాట చెప్పారట. రచితను ఒక నాయికగా అనుకున్నాం.. కానీ ఇంకా సంప్రదించలేదు అని బోయపాటి టీమ్ వెల్లడించింది.

ఇక ఈ సినిమాలో ఇప్పటికే బాలయ్య కోసం విలన్ గా బాలీవుడ్ ఖల్ నాయక్ సంజయ్ దత్ ని తీసుకు వస్తున్నారన్న పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ సంగతి అలా ఉంటే సెంటిమెంట్ గా భావించే హీరోయిన్స్ ఎంపికనే బోపాటికి కష్టంగా మారింది. ప్రతిసారీ సీనియర్ బ్యూటీల్ని ఎంపిక చేస్తే రిపీటెడ్ హీరోయిన్స్ ని చూసేందుకు యూత్ ఇంట్రస్ట్ గా ఉండరు. అందుకే కాస్త బోయపాటి ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తున్నా బాలయ్య కోసం సరైన బ్యూటి ఫుల్ హీరోయిన్ దొరకడం లేదట. ఇక ప్రస్తుతం తెలుగులో ఉన్న యంగ్ హీరోయిన్స్ అందరు వరుస కమిట్ మెంట్లతో బిజీగా ఉన్నారు. దీంతో బాలయ్యకు హీరోయిన్స్ ని సెలెక్ట్ చేయడం కష్ఠమవుతోందట. అయితే బాలయ్య ఏజ్ ఎక్కువైంది..అందుకే ఇప్పుడున్న వాళ్ళు ఎవరు సెట్ అవడం లేదన్న కామెంట్స్ కూడా పడుతున్నాయట. 



మరింత సమాచారం తెలుసుకోండి: