సినిమా అనే రంగుల ప్రపంచంలో ఎవరి టైం ఎలా టర్న్ అవుతుందో ఎవరికి తెలియదు. హిట్టు కొట్టి ఓవర్ నైట్ స్టార్ అయిన హీరోలు కూడా వరుస ఫ్లాపులు వస్తే అతన్ని పలుకరించే నాధుడే ఉండరని తెలిసిందే. ఎప్పుడూ సక్సెస్ లో రాణించాలి అంటే కష్టంతో పాటుగా కొద్దిగా లక్ కూడా కలిసి రావాల్సిందే. ఇంతకీ ఈ లీడ్ అంతా దేనికి అనుకుంటున్నారు కదా యువ హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదట్లో ఒకటి రెండు క్రేజీ హిట్లు కొట్టి లవర్ బోయ్ ఇమేజ్ సంపాదించిన ఓ హీరో ఇప్పుడు కెరియర్ సందిగ్ధంలో పడటంతో వచ్చిన అవకాశాలను చేస్తున్నాడట.


అంతేకాదు ఈ హీరో ఇప్పుడు ఓ బడా ప్రొడ్యూసర్ నిర్మాణంలో సినిమా చేస్తున్నాడట. ఆ సినిమా కోసం రెమ్యునరేషన్ లేకుండా చేయాలన్నది నిర్మాత డిమాండ్. చేసేదేం లేక ప్రొడ్యూసర్ చెప్పినట్టుగా తల ఊపాడట. అయితే మరీ ఫ్రీ చేయించుకోవడం బాగోదని అనుకున్న నిర్మాత అతనికి నెలకు జీతంగా లక్ష రూపాయలు ఇస్తానని చెప్పాడట.


ఒకవేళ సినిమా హిట్టైతే అప్పుడు రెమ్యునరేషన్ గా ఎంతోకొంత ఇస్తానని చెప్పాడట. అసలు ఏ సినిమాలు లేని టైం లో వచ్చిన ఈ ఆఫర్ ను కళ్లకు అద్ది మరి తీసుకున్నాడట ఆ హీరో. ఆ సినిమాలో హీరోయిన్ గా ఓ క్రేజీ హిట్ కొట్టి యూత్ లో బీభత్సమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరోతో చేసిన అమ్మాయిని పెట్టారట. ఆమెతో చేసిన ఆ హీరో స్టార్ అయ్యాడు కాని ఈ అమ్మడు పరిస్థితి అంత గొప్పగా ఏం లేదని తెలుస్తుంది.


ఇక ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా దాదాపు పూర్తయిందని తెలుస్తుంది. డిసెంబర్ 25న ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేశారట. ఒకప్పుడు యువ హీరోగా వరుస సినిమాలు చేసిన ఇతగాడు డబ్బులు వస్తున్నాయి కదా అని ఏ సినిమా పడితే ఆ సినిమా చేసి ఇప్పుడు నెల జీతం తీసుకునే పరిస్థితికి దిగజారాడు. మరి ఈ సినిమా అయినా హిట్టు కొట్టి హీరోగా మళ్లీ నిలబడతాడేమో చూడాలి. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: