పెన్ను పట్టుకున్న ప్రతి ఒక్కడిని రైటర్ అంటారు.. స్టార్ట్ కెమెరా యాక్షన్ అని చెప్పగానే దర్శకుడు అంటారు.. కానీ ఈ పెన్ను కదలాలన్నా.. ఆ దర్శకుడు యాక్షన్ చెప్పాలన్నా ముందు ఉండాల్సింది నిర్మాత. అతను డబ్బులు పెడితేనే కాని వారి సృజనకు రూపం ఉండదు. తెలుగు పరిశ్రమలో ఎంతోమంది గొప్ప నిర్మాతలు వచ్చారు.. వస్తున్నారు. అలాంటి వారి స్పూర్తితో మరో కొత్త నిర్మాణ సంస్థ వస్తుంది. ఒకటి రెండు కాదు ఒకేసారి 3 సినిమాలతో నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు M స్క్రీన్స్ అధినేత మువ్వా విజయా చౌదరి. 


యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయడమే మా బ్యానర్ యొక్క ముఖ్య ఉద్దేశ్యమని.. మా బ్యానర్ లో వైవిధ్యమైన చిత్రాలు వస్తాయని నిర్మాత మువ్వా విజయా చౌదరి చెబుతున్నారు. 
మూడు సినిమాల్లో మొదటి సినిమా డిసెంబర్ రెండో వారంలో ప్రారంభం కానుంది. ఈ సినిమాను రాజశేఖర్ రావి డైరెక్ట్ చేయనున్నారు. కొన్ని సినిమాలకు సహాయక దర్శకుడిగా చేసిన అనుభవంతో పాటుగా షార్ట్ ఫిలిమ్స్ చేసిన అనుభవంతో రాజశేఖర్ రావి డైరక్షన్ ఛాన్స్ అందుకున్నారు. అతను చెప్పిన స్క్రీన్ ప్లే తరహా కథ నచ్చడంతో వెంటనే సినిమా ఓకే చేశారు నిర్మాత విజయా చౌదరి.


రాజశేఖర్ రావి రాసిన ఈ కథ పూర్తి స్క్రీన్ ప్లే తరహ సస్పెన్స్ మూవీగా వస్తుందట. ఈ సినిమానే M స్క్రీన్ బ్యానర్ లో మొదటి సినిమాగా తెరకెక్కుతుంది. ఈ మూవీలో హీరోగా "నాటకం" ఫేమ్ ఆశిష్ గాంధి నటిస్తున్నారు. ఆశిష్ గాంధీ నాటకం తరువాత తమిళ్,కన్నడలో  సినిమాలు చేస్తూ తెలుగులో ఎన్నో కథలు విన్నా అంతగా ఆకట్టుకోలేదట ఏదేమైనా  ఈ సారి ఒక మంచి వైవిద్యమైన కథతో రావాలనే  అనుకున్న ఈ హీరోకి యువ దర్శకుడి కథ బాగా నచ్చేసి వెంటనే నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.


ఈ చిత్రం తరువాత  స్మరణ్ రెడ్డి, ఆర్.సురేష్ లతో తదుపరి రెండు సినిమాలు విజయా చౌదరి చేస్తున్నారు. అభిరుచి గల సినిమాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు ఈ కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నారు దర్శక నిర్మాతలు. మరి ఈ సినిమాలతో పరిచయం అవుతున్న న్యూ టాలెంటెడ్ డైరక్టర్స్ ఇండస్ట్రీకి ఎలాంటి సినిమాలు అందిస్తారో చూడాలి.    



మరింత సమాచారం తెలుసుకోండి: