ఒక హీరోపై విపరీతమైన అభిమానం పెంచుకున్న ఒక భార్య హత్యకు గురి అయింది. హీరోపై పిచ్చి అభిమానం భర్త చేతుల్లోనే దారుణ హత్యకు గురయ్యేలా చేసింది. 
వివరాల్లోకి వెళితే అమెరికా న్యూయార్క్ లోని క్వీన్స్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలి పేరు డోన్నె డోజోయ్. అమెరికాలోని న్యూయార్క్‌లో నివసిస్తున్నారు. మూడేళ్ల కిందట దినేశ్వర్ బుదిహాట్తో వివాహమైంది. వారిది ప్రేమ వివాహంగా స్నేహితుల ద్వారా తెలిసింది. క్వీన్స్ లోని ఓజోన్ రోడ్లో ఉండే జెమిని అల్ట్రా లాంజ్లో బార్‌లో డోజోయ్ పనిచేస్తున్నారు. హృతిక్ రోషన్కు ఆమె వీరాభిమాని. ప్రతి రోజూ అతని గురించే కలవరిస్తుండేది. రాత్రి వేళలలో కూడా అతని సినిమాలను విపరీతంగా చూస్తుండేది. ఈ విషయం మీద భర్త దినేశ్వర్ తరచూ భార్యతో గొడవ పడుతుండేవాడు.


అయినా,  ఆమె హృతిక్ రోషన్ పై ఉన్న అభిమానాన్ని వదలుకోలేదు. పైగా మరింత పెరిగింది. హృతిక్ రోషన్ తో భర్తను పోల్చి చూసేది. అతనిలా ఉండాలని అంటూ ఉండేది. ఇది దినేశ్వర్‌కు అస్సలు నచ్చేది కాదు. తరచూ ఆమెతో ఘర్షణ పడేవాడు. దీనితో డోజోయ్ భార్య ను చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు. భర్త వేధింపులు తాళలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య ఫిర్యాదుతో భర్తను అరెస్ట్‌ చేసిన పోలీసులు అతన్ని నాలుగు రోజుల పాటు జైలులో ఉంచారు. దీంతో ఆమెపై తీవ్రంగా కక్ష పెంచుకున్న దినేశ్వర్‌ ఓ అర్థరాత్రి ఇంటికి వచ్చి ఆమెను కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.


హత్య పై డోజోయ్ స్నేహితులని విచారించిన పోలీసులకు కొన్ని ఆసక్తికర విషయాలు తెలిసాయి. డోజోయ్ భార్య చాలా అందంగా ఉండేదని, హృతిక్ పై అభిమానం పెంచుకోవడం సహించలేక  డోజోయ్ భార్య ని హత్య చేసినట్లు పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: