తక్కువ సినిమాలలో నటించి అతి తక్కువ సమయంలోనే మంచి  పేరు తెచ్చుకున్న వారిలో హీరోయిన్ అర్చన ఒకరు . ఈ మాధ్య కాలంలో హీరోయిన్ అర్చన తన పెళ్ళి ప్రస్తావనపై తనకు కాబోయే భర్త గురించి వివరాలన్ని  సోషల్ మీడియాలో పోస్ట్లు చేసిన విషయం తెలిసిందె. పెళ్లి వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి  హీరోయిన్‌ అర్చన  సంగీత్‌ కార్యక్రమం నిర్వహించారు.ఈ సంగీత్ కార్యక్రమానికి వారి తరపున వున్నా బంధు మిత్రులంతా హాజరయ్యారు.


ఈ సంగీత్ లో ఎంతో సంతోషంగా  బంధు మిత్రులతో పాటు వధువు, వరుడు హుషారుగా నృత్యాలు చేశారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నాయి. వీటిని చూసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అభిమానులంతా వధూవరులకు మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తున్నారు.


హీరోయిన్ అర్చన కాబోయే భర్త వివలరు ఎలా వున్నాయి ఆయన ఓ ప్రముఖ హెల్త్‌కేర్ కంపెనీ ఉపాధ్యక్షుడు, వ్యాపారవేత్త జగదీశ్‌ ,వీరిద్దరి  జంటను చూస్తున్న  అభిమానులకు కన్నుల పండుగగా వుంది అని తెలిపారు . అర్చన పెళ్ళి ముహర్తం హైదరాబాద్‌లో భక్తవత్సలంతో 14 తేదీ తెల్లవారుజామున 1.30 గంటలకు  అర్చన వివాహం జరగనుంది. దీని తరువాత 13వ తేదీ సాయంత్రం వివాహ రిసెప్షన్ ఉంటుంది. ఈ వివాహానికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన ఎందరో  ప్రముఖులు హాజరుకానున్నారు.


నేను సినిమాతో 2004లో తెరంగేట్రం చేసిన అర్చన.. తెలుగుతో పాటు కన్నడ, తమిళ సినిమాల్లోనూ నటించింది. సరైన విజయం దక్కపోవడంతో హీరోయిన్‌గా నిలదొక్కుకోలేకపోయింది. ప్రముఖ రియాల్టీ షో తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌-1 కంటెస్టెంట్‌గా పాల్గొని తన  ప్రతిభ చాటుకుంది. తిరిగి ఎందరో అభిమానులను అర్థన సంపాదించుకుంది .ఇటీవల ఎన్నో టీవీల్లో పలు డ్యాన్స్‌షోలకు అర్చన న్యాయనిర్ణేతగా వ్యవహరించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: