నటి  ఆండ్రియా తెలుగు తమిళ చిత్రాలలో తన నటనతో మనందరినీ ఆకట్టుకుంది. ఆండ్రియాను  టాలెంట్‌కు కేరాఫ్‌ అడ్రెస్స్  అని చెప్పవచ్చు. ఎటువంటి  పాత్రనైనా మెప్పించగల సత్తా ఉన్న నటి. వ్యక్తిగతంగానూ ఈ నటి రూటు సపరేటు. ఆండ్రియా తన ఇష్టమైన రీతిలో బ్రతికే  స్వచ్ఛ జీవి  .  ఆండ్రియా తమిళంతో పాటు తెలుగు, ఇతర భాషల్లోనూ నటిగా పేరున్న విషయం తెలిసిందే నటన మాత్రమే కాకుండా ఈమెలో  మంచి గాయని ఉంది.


అంతే కాదు రచయిత కూడా ఉంది. చివరిగా వడచెన్నై చిత్రంలో ఈ అమ్మడిని  చూశాం. ఆ తరువాత తెరపైకి కనిపించలేదు. అలాంటి ఆండ్రియా ఆ మధ్య ఒక కార్యక్రమంలో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను ఒక వివాహితుడితో సంబంధం పెట్టుకుని శారీరకంగానూ, మానసికంగా బాధపడినట్లు పేర్కొంది. అతని నుంచి బయట పడి ఆయుర్వేద చికిత్స పొంది ఉపశమనం పొందుతున్నట్లు పేర్కొంది.


 తాను రాసుకున్న పుస్తకంలో తనను మోసం చేసిన వ్యక్తి ఎవరన్నది బయట పెడతానని బాంబ్‌ పేల్చింది. అయితే పుస్తకాన్ని విడుదల చేయలేదు. మానసికంగా క్షోభకు గురి చేసిన ఆ వ్యక్తి బెదిరించడం వల్లే ఆండ్రియా తన పుస్తకాన్ని విడుదల చేయలేదనే ప్రచారం జరిగింది. ఆ వ్యక్తికి రాజకీయాలతో సంబంధాలు ఉన్నాయని, సినిమా రంగంలోనూ ఉన్నాడని సమాచారం.


పుస్తకం విషయం తెలిసిన ఆ వ్యక్తి ఆండ్రియాను బెదిరించినట్లు తాజాగా సామాజిక మాధ్యమాల్లో టాక్‌ వైరల్‌ అవుతోంది. దీంతో ఆండ్రియా పుస్తకం బయటకు వచ్చే అవకాశం లేదనే భావించాలి. ఈ సంచలన నటికి మళ్లీ నటనపై దృష్టి సారించిన  అవకాశాలు బాగానే తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం కావట్టం, మాళిగై చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా విజయ్‌తో ఆయన 64వ చిత్రంలో నటించే అవకాశాన్ని కొట్టేసింది.కానీ  ఇందులో ఆండ్రియా హీరోయిన్‌ కాదట. ఒక ముఖ్య పాత్రలో నటిస్తుందని  సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: