మెగాస్టార్ చిరంజీవి కుటుంబ హీరోలను లెక్కేస్తే ఓ క్రికెట్ టీమ్ అంత ఉంటుందనేది టాలీవుడ్ మాట. చిరంజీవి కష్టపడి వేసిన రాచబాటలో అంతమంది హీరోలయ్యారు. హీరోలుగానే కాకుండా టాప్ స్టార్స్, స్టార్స్ అయిపోయారు. ప్రపంచంలోనే ఏ హీరో కుటుంబంలోనూ ఇంతమంది స్టార్స్ ఉండరు. ఇది నిజంగా ఓ ఘనతే. తమ్ముళ్లూ, కొడుకులూ, కూతురూ, మేనల్లుళ్లే కాకుండా ఆయన బాటలో నడుస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న మరో వ్యక్తి.. ఆయన చిన్న అల్లుడు కల్యాణ్ దేవ్.

 


మొదటి సినిమా విజేతతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు కల్యాణ్. మెగా అభిమానుల అండదండలతో ఆ సినిమా యావరేజ్ గా వెళ్లిపోయింది. కొద్దిగా గ్యాప్ తీసుకుని ఆయన రెండో సినిమా స్టార్ట్ చేశాడు. మొదటి చిత్రం సాఫ్ట్ క్యారెక్టర్ చేయటంతో ఈసారి మాస్ అంశాలతో రెండో సినిమా చేయాలని ‘సూపర్ మచ్చి’ అనే సినిమా స్టార్ట్ చేశాడు. పులి వాసు దర్శకత్వంలో నలభై శాతం షూటింగ్ కూడా జరుపుకున్న ఈ సినిమా మధ్యలో ఆగిపోయిందనే టాక్ వస్తోంది. సినిమా నిర్మాత రిజ్వాన్ తాజా సినిమా తిప్పరా మీసం ఫ్లాప్ వెంచర్ గా నిలవడంతో ఆర్ధికంగా దెబ్బ తిన్నాడని అంటున్నారు. అందుకే కల్యాణ్ సినిమా షూటింగ్ ఆపేశారని సోషల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి.

 


నిజానికి మెగా హీరోల సినిమాలకు బడ్జెట్ సమస్యలు ఉండవు. సాయి ధరమ్ తేజ్ మొదటి సినిమా రేయ్ కూడా బడ్జెట్ గొడవల్లో రిలీజ్ ఆగిపోయి తన రెండో సినిమా మొదటి సినిమాగా రిలీజ్ అయింది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ బడ్జెట్ పరంగా హెల్ప్ చేశాడనే టాక్ వచ్చింది. మరి ఈ సినిమా విషయంలో వచ్చిన వార్తలు నిజమైతే మెగా కుటుంబం నుంచి ఆర్ధికంగా ఆదుకునే అవకాశం లేకపోలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: