టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీలో ఒక హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ త్వరలో తన సొంత ప్రొడక్షన్ హౌస్ ఒకటి స్టార్ట్ చేయబోతున్నారు అనే వార్తలు పలు మీడియా మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. కొద్దిరోజులుగా తన కుటుంబసభ్యుల తో కలిసి ఈ విషయమై ఎన్టీఆర్ చర్చలు జరుపుతున్నారని, 

అలానే వారు కూడా తప్పకుండా స్టార్ట్ చేయమని సమ్మతం తెలిపినట్లు సమాచారం. అయితే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయాలా లేక వద్దా అనే సందిగ్ధావస్థలో ఉన్న ఎన్టీఆర్ కు తన మిత్రులైన మహేష్ బాబు మరియు రామ్ చరణ్ కొన్ని సలహాలు ఇవ్వడంతో పాటు ధైర్యంగా స్టార్ట్ చేయమని చెప్పినట్లు టాలీవుడ్ వర్గాల టాక్. నిజానికి కొన్నాళ్ల క్రితం మహేష్ బాబు జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, అలానే రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్స్ స్టార్ట్ చేసి, ఇప్పటివరకు పలు విజయవంతమైన సినిమాలు కూడా నిర్మించడం జరిగింది. కాబట్టి నువ్వు కూడా ఏ మాత్రం ఆలోచించకుండా స్టార్ట్ చేయి అని భరోసా ఇవ్వడంతో పాటు, 

ఏదైనా సినిమా స్టార్ట్ చేసేముందు కాస్ట్ కంట్రోల్ వంటి వాటిపై ఎలా వ్యవహరించాలి అనే విషయాలపై వారిద్దరూ ఎన్టీఆర్ కు కొంత సూచనలు కూడా చేశారట. సో దీనిని బట్టి ఎన్టీఆర్ అతి త్వరలో తన ఓన్ ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేయడం ఖాయం అని అంటున్నారు. ఇప్పటికే తన అన్నయ్య నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పేరుతో ఒక సంస్థను మొదలెట్టి, పలు విజయవంతమైన సినిమాలు తీస్తూ ముందుకు పోతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ కూడా తన సొంత సంస్థను స్టార్ట్ చేసి, ఎంత మేర విజయాలు అందుకుంటారో చూడాలి......!!


మరింత సమాచారం తెలుసుకోండి: